Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
Rusk Halwa: రస్క్‌లతో స్వీట్ హల్వా.. రుచి అదిరిపోతుంది అంతే! ఈజీగా ఎలా చేసుకోవాలంటే?
రస్క్‌లను సాధారణంగా టీలో నంజుకొని తింటూ ఉంటారు. ఒక సిప్ టీ తాగి.. ఒక ముక్క రస్క్ ఆ అమోఘంగా ఉంటుంది. అయితే రస్క్‌లను కేవలం టీలో స్నాక్‌గా మాత్రమే కాకుండా స్వీట్‌గా చేసుకొని కూడా తినొచ్చు. అవును మీరు చదువుతున్నది నిజమే. డబల్ కా మీఠాలాగా రస్క్‌తో హల్వా స్వీట్ అద్భుతంగా ఉంటుంది. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండే ఈ స్వీట్‌ని ఎలా చేసుకోవాలి? రస్క్ హల్వా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రస్క్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు
- రస్క్‌లు
- పంచదార
- నెయ్యి
- యాలకుల పొడి
- డ్రై ఫ్రూట్స్
- నీళ్లు

రస్క్ హల్వా తయారీ విధానం
ఈ రస్క్ హల్వా తయారు చేయడానికి ముందుగా రస్క్‌లను ఒక రోటీలో లేదా మిక్సీలో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ దంచుకున్న రస్క్ మిశ్రమాన్ని ఒక కప్పులో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి.. ఒక పాన్ పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యిలో మనం తీసుకున్న లేదా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి.
డ్రై ఫ్రూట్స్ వేగాకా అందులోనే మనం ముందుగా కచ్చా పచ్చాగా దంచిపెట్టుకున్న రస్క్‌లను కూడా వేసుకొని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్, రస్క్‌లు మొత్తం బాగా వేగాకా వాటిని ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా నీళ్లు పోసుకొని అందులో పంచదార వేసుకోవాలి. పంచదార మొత్తం కరిగి మంచి పానకంలా దగ్గరా అయ్యే వరకు వేడి చేసుకోవాలి.
పానకం సిద్ధమయ్యేక అందులోనే ఏలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ మంచిగా ఉండడంతో పాటు రుచి అమోఘంగా ఉంటుంది. పానకం కొంచెం జిగురుగా మారిన తరువాత.. అందులో వేయించుకున్న రస్క్‌ల పొడి వేసుకొని కింద మాడిపోకుండా సన్నటి మంట మీద ఉడికించుకోవాలి.
ఆ తరువాత వాటిపై ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చల్లుకుంటే రస్క్ హల్వా సిద్ధమైనట్టే. కావాలనుకునే వాళ్ళు, అందుబాటులో ఉంటే కుంకుమ పూలను కూడా వేసుకోవచ్చు. ఇది రుచిని అమాంతం పైకి లేపేస్తుంది. ఇది అతి తక్కువ సమయంలో సిద్ధమైపోవడంతో పాటు ఎంతో రుచికరంగా ఉంటుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందు పరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణులు సలహాలు తీసుకోవాలి. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి సంబంధం లేదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications