Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
గుడ్లు,ఓవెన్ అక్కర్లేదు..ఇంట్లోని పదార్థాలతోనే నోట్లో కరిగిపోయే స్పాంజ్ కేక్..ఎలా చేసుకోవాలంటే..
కేకు అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే కేకు రుచిని ఆస్వాదించాలని అందరికీ ఉంటుంది. అయితే బేకరీల్లో తయారయ్యే కేకులకన్నా ఇంట్లోనే ఈజీగా కేకులను తయారుచేసుకోవచ్చు. బర్త్ డే పార్టీలకు, ఫంక్షన్స్ కి ఇంట్లోనే సులభంగా కేకు తయారుచేసుకోవచ్చు. గుడ్లు లేకుండా మెత్తగా, రుచికరంగా ఉండే స్పాంజ్ కేక్ ఒవెన్ కూడా అక్కర్లేకుండా జస్ట్ వంటింట్లోని పదార్థాలతో చేసుకోవచ్చు.
గుడ్లు లేకుండా కేక్ తయారుచేయడం అనేది చాలా సులభం, రుచికరంగా ఉంటుంది. గుడ్ల వాసన నచ్చని వారికి, గుడ్లు తినని వారికి ఈ రెసిపి ఎంతో ఉపయోగపడుతుంది. గుడ్లు లేకుండా మెత్తగా, రుచికరంగా ఉండే స్పాంజ్ కేక్ ఇంట్లోనే తయారుచేయడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఎగ్ లెస్ స్పాంజ్ కేకు యారీకి కావాల్సిన పదార్థాలు
-పెరుగు
-మైదా పిండి
-ఆయిల్
-చక్కెర
-యాలకల పొడి
-పాలు
-బేకింగ్ పౌడర్
-వంట సోడా
-ఉప్పు
తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో అరకప్పు చక్కెర, పావు కప్పు సన్ ఫ్లవర్ ఆయిల్, అరకప్పు పెరుగు వేసి మొత్తం బాగా కలిసేలా నురగగా,మెత్తగా అయ్యేదాకా బాగా బీట్ చేసుకోండి.
-ఇప్పుడు బాగా కలిపిన మిశ్రమంలో పావు టీస్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి. వెనీలా ఎసెన్స్ లేకుంటే పావు టీస్పూన్ యాలకల పొడి వేసి కలుపుకుంటే సరిపోతుంది.
-తర్వాత బౌల్ మీద జల్లెడ పెట్టి అందులో 1 కప్పు మైదా పిండి, 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్, అర టీస్పూన్ వంట సోడా, చిటికెడు ఉప్పు వేసి స్పూన్ తో కలుపుతూ పిండి మొత్తాన్ని బాగా జల్లించుకోండి.
-ఇప్పుడు బౌల్ లోని మొత్తాన్ని ఒకే డెరక్షన్ లో బాగా కలుపుకున్నాక అందులో పావు కప్పు కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోండి.
-తర్వాత ఏదైనా అల్యూమినియం గిన్నె తీసుకొని అడుగున కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం మైదా పిండిని కూడా వేసి పూసినట్లు చేయండి.
-ఇప్పుడు ఈ గిన్నెలో రెడీ చేసుకున్న కేకు మిశ్రమాన్ని వేసుకొని దిబ్బరొట్టె మాదిరి సెట్ చేసుకోండి.
-తర్వాత లోతు ఎక్కువగా ఉండే ఒక అల్యూమినియం గిన్నెను స్టవ్ మీద పెట్టి అడుగున కొంచెం ఉప్పు లేదా ఇసుక పోసి 10 నిమిషాలు ఒత్తిగనే హీట్ చేయాలి. ఏమీ లేకుంటే జస్ట్ స్టాండ్ పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు మీడియం మంట మీద వేడిచెయ్యండి.
-తర్వాత కేకు మిశ్రమం ఉంచిన గిన్నెను నేరుగా స్టవ్ మీద ఉన్న గిన్నె మధ్యలో పెట్టి అడుగులు అంటుకోకుండా చూసుకోండి. మూతపెట్టేసి మీడియం మంట మీద 40 నిమిషాల పాటు ఉంచాలి.
-తర్వాత మూత తీసి చాకుని కేకు మధ్యలోకి గుచ్చి చూడండి. పిండి అంటుకోకుండా చాకు నీట్ గా బయటకు వచ్చిందంటే కేకు ఉడికిందని అర్థం.వెంటనే స్టవ్ ఆపేసి గిన్నెను బయటకు తీసేయండి.
-పూర్తిన చల్లారిన తర్వాత చాకుతో అంచులను కదిపి ఓ ప్లేట్ లో దాన్ని బోర్లిస్తే ఈజీగా కేకు బయటకు వచ్చేస్తుంది. నచ్చిన షేపులో దీన్ని కట్ చేసుకొని తింటుంటే కెవ్వు కేక అన్నట్లుగానే ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













