Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
Poha Cutlet: తక్కువ టైంలోనే క్రిస్పీ,టేస్టీ స్నాక్..పోహా కట్ లెట్ ఎలా చేసుకోవాలంటే
పోహా కట్లెట్.. అటుకులు,బంగాళదుంపలతో తయారుచేసే ఒక రుచికరమైన, క్రిస్పీ స్నాక్. ఒక్కసారి తిన్నారంటే జన్మలో మర్చిపోలేని రుచి దీని సొంతం. ఇది అల్పాహారంగా, సాయంత్రం స్నాక్‌గా లేదా పిల్లల లంచ్ బాక్స్‌కు కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీని తయారీ సులువుగా ఉండటంతో పాటు దీనిలో ఉండే పదార్థాల వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీని తయారుచేయడం కూడా చాలా ఈజీ. బ్యాచిలర్స్ కూడా తమ రూముల్లో చాలా ఈజీగా దీన్ని తయారుచేసుకోవచ్చు. పోహా కట్ లెట్ ను తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ ఉంటుంది.
పోహా కట్ లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బంగాళదుంప
-మైదాపిండి
-మక్క అటుకులు
-అటుకులు
-ఆయిల్
-ఉప్పు
-చాట్ మసాలా పొడి
-జీలకర్ర
-పసుపు
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-కొత్తిమీర
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కారం

పోహా కట్ లెట్ తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ తీసుకోండి. అందులో 1 కప్పు అటుకులు వేయండి. నీళ్లు పోసి అటుకులను శుభ్రంగా కడగి ఆ నీళ్లను వంపేసి కొంచెం నీళ్లు చల్లి కొద్దిసేపు బౌల్ మీద ప్లేట్ పెట్టి 5 నిమిషాలు వదిలేయాలి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 3 బంగాళదుంపలును ఒక్కొక్కటి రెండు ముక్కలుగా కట్ చేసి వేసి ఇందులోనే 1 కప్పు నీళ్లు పోసి మూతపెట్టి 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. బంగాళదుంప మెత్తబడిన తర్వాత స్టవ్ ఆపి వాటిని పక్కనపెట్టి చల్లారనివ్వాలి.
-ఇప్పుడు మెత్తగా అయిన అటుకులను చేత్తో మెదిపి ఇందులోనే ఉడకించి చెక్కు తీసిన బంగాళదుంపలను తురిమి వేయాలి. ఇందులోనే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర తరుగు, అరటీస్పూన్ కారం,రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ చాట్ మసాలా పొడి, అర టీస్పూన్ జీలకర్ర,చిటికెడు పసుపు వేసి మొత్తం బాగా కలిసేటట్లు పిండిముద్దలా కలపాలి.
-తర్వాత కొంచెం కొంచెం పిండిముద్దను చేతుల్లోకి తీసుకొని దాన్ని కట్ లెట్ షేపులో వత్తుకొని ఓ ప్లేట్ లో పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి వేడి చేయ్యండి.
-ఆయిల్ వేడెక్కేలోపు ఓ బౌల్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల మైదాపిండి వేసి ఇందులోనే చిటికెడు ఉప్పు ,కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం పాలమాదిరిగా ఉండాలి.
-ఇప్పుడు మరో ప్లేట్ లో మక్క అటుకులను వేసి వీటిని చేత్తో లేదా గిన్నెతో అయినా చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలా మాష్ చేయాలి.
-ఇప్పుడు వత్తుకున్న కట్ లెట్ లను మైదాపిండి మిశ్రమంలో ముంచి దాన్ని మక్క అటుకులో ప్లేట్ లో పెట్టి వాటితో కట్ లెట్ ని కోట్ చేసి దాన్ని వేడెక్కిన ఆయిల్ లో వేసి బాగా ఫ్రై చేసుకోండి. అంతే పోహా కట్ లెట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications