Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మిక్సీ అక్కర్లేదు,నూనెతో పనిలేదు..బీహార్ స్టైల్ టమాటో చట్నీ..స్మోకీ ఫ్లేవర్ తో సూపర్ టేస్ట్
రోజూ తినే కూరలు, పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే ఈ రోజు మీ భోజనానికి ఒక కొత్త రుచిని జోడించండి. అదే బిహారీ స్టైల్ టమాటో చట్నీ. సాధారణంగా మనం టమాటోలను నూనెలో వేయించి పచ్చడి చేస్తాం.
కానీ బిహారీ స్టైల్ లో టమాటోలను, ఇతర దినుసులను నేరుగా మంటపై కాల్చి చేస్తారు. ఇలా చేయడం వల్ల చట్నీకి అద్భుతమైన స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇది అన్నం, చపాతీ, లేదా పుల్కాలోకి అద్భుతమైన కాంబినేషన్. బిహారీ స్టైల్ టమాటో చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బాగా పండిన టమోటాలు: 2
వెల్లుల్లి: 2 చిన్న గడ్డలు
పచ్చిమిర్చి: 2-3
కొత్తిమీర: గుప్పెడు
ఉల్లిపాయ: 1
ఉప్పు: రుచికి సరిపడా
కాల్చిన జీలకర్ర పొడి: అర టీస్పూన్
ఎర్ర కారం: పావు టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక గ్రిల్ స్టాండ్ (పుల్కాలు కాల్చే జాలి)పెట్టి దానిపై టమోటాలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలను ఉంచండి. మీడియం మంట ఉంచి టమోటాల పై తొక్క నల్లగా మారి, లోపల గుజ్జు మెత్తబడే వరకు అన్ని వైపులా తిప్పుతూ కాల్చాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా కాలిన మచ్చలు వచ్చే వరకు వేయించండి.
-కాలిన టమోటాలు, వెల్లుల్లి, మిరపకాయలను ఒక ప్లేట్ లోకి తీసుకుని కాసేపు చల్లారనివ్వండి. అవి చల్లారాక టమోటాల పైన నల్లగా మాడిన తొక్కను జాగ్రత్తగా తొలగించండి. అలాగే వెల్లుల్లి పొట్టును కూడా తీసేయండి. తొక్క తీసిన తర్వాత టమోటాలను నీటితో కడగకూడదు, అలా చేస్తే ఆ స్మోకీ ఫ్లేవర్ పోతుంది.
-ఇప్పుడు ఒక రోలులో ముందుగా కాల్చిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసి కచ్చాపచ్చాగా దంచండి. రోలు లేకపోతే గిన్నెలో వేసి పప్పు గుత్తితో కూడా మెదుపుకోవచ్చు. కానీ మిక్సీలో మాత్రం వేయకండి, ఈ చట్నీ పేస్ట్ లా ఉంటే బాగోదు.
-వెల్లుల్లి, మిర్చి నలిగిన తర్వాత, అందులో గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి దంచండి. చివరగా కాల్చి, తొక్క తీసిన టమోటాలను వేసి ముతకగా మెదపండి. టమోటా ముక్కలు అక్కడక్కడా తగులుతూ ఉంటేనే రుచి బాగుంటుంది.
-ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. దీనికి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఎర్ర కారం, వేయించిన జీలకర్ర పొడిని జత చేయండి. వాటన్నింటినీ బాగా కలపండి. బిహారీ ఒరిజినల్ రుచి కోసం ఈ దశలో ఒక చెంచా పచ్చి ఆవనూనె కలిపితే రుచి ఇంకాస్త పెరుగుతుంది.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే బిహారీ స్టైల్ టమాటో చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications