Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Diwali 2024: దీపావళి రోజు ఇంట్లోనే చేసుకోగలిగే సింపుల్ స్వీట్స్ ఇవే.. ఎలా చేసుకోవాలంటే?
దీపావళి రోజు చాలా మంది స్వీట్స్ చేసుకుంటూ ఉంటారు. పక్కింటి వారికి ఇవ్వడంతో పాటు ఇంటికి వచ్చే బంధువులకు ఈ స్వీట్స్ పెడతారు. చాలా మంది పండగపూట ట్రెడిషనల్‌గా ఇంట్లోనే స్వీట్స్ చేసుకోవాలని అనుకుంటారు. అయితే ఇంట్లోనే స్వీట్స్ చేసుకోవడానికి ఎలాంటి స్వీట్స్‌ను ఎంచుకోవాలి, ఆ స్వీట్స్ ఎలా చేయాలి, వాటి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం హల్వా:
ఈ బాదం హల్వా తయారు చేయడానికి బాదం, నెయ్యి, చెక్కెర, పాలు, యాలకులు, కుంకుమపువ్వు అవసరం పడతాయి. ముందుగా కొన్ని బాదం తీసుకొని వాటిని నాలుగు లేదా అయిదు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. అనంతరం వాటి తొక్క తీసేసి, మెత్తగా ఒక పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను పక్కకు పెట్టేసి.. స్టవ్ ఆన్ చేసి, ఒక పెనం పెట్టుకోవాలి.
ఇప్పుడు అందులో పాలు వేసుకొని బాగా మరగనివ్వాలి. అనంతరం అందులో మనం ముందుగా చేసిపెట్టుకున్న బాదం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పేస్ట్ చిక్కగా మారే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన బాదం పేస్ట్‌లో షుగర్ కలుపుకోవాలి. అలాగే ఏలకులు, కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి. అనంతరం నెయ్యి వేసి, అది పూర్తిగా హల్వాలో మిక్స్ అయ్యేంత వరకు ఉంచుకుంటే బాదం హల్వా సిద్ధమైనట్లే.

గులాబ్ జామూన్:
ఈ గులాబ్ జామూన్‌ను పండగ రోజు మాత్రమే కాదు సాధారణ రోజుల్లో కూడా తినొచ్చు. అయితే ఈ గులాబ్ జామున్ తయారీకి గులాబ్ జామున్ పొడి, షుగర్, పాలు, ఉప్పు, నూనె, యాలకుల పొడి అవసరం అవుతాయి. ముందుగా గులాబ్ జామున్ పొడి తీసుకొని అందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. అనంతరం పాలను అందులో పోసుకొని, బాల్స్ అయ్యే విధంగా పిండిని కలుపుకోవాలి.
ఆ విధంగా కలిపిన పిండితో బాల్స్ చేసుకోవాలి. దీనికంటే ముందే షుగర్ సిరప్‌ను సిద్ధం చేసుకోవాలి. కావాల్సినంత చెక్కర తీసుకొని దానిని బాగా వేడి చేసి, ఒక సిరప్ మాదిరిగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అందులోనే యాలకుల పొడి కూడా వేసుకోవాలి. అనంతరం స్టవ్ వెలిగించి, దానిపై కడాయి పెట్టి.. అందులో గులాబ్ జామున్ చేయడానికి సరిపడా నూనెను పోసుకోవాలి.
నూనె బాగా వేడెక్కాక.. ఇప్పుడు ముందుగా చేసుకున్న బాల్స్‌ను అందులో వేసుకొని గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అనంతరం వాటిని తీసి మనం సిద్ధం చేసి పెట్టుకున్న షుగర్ సిరుప్‌లో వేసుకోవాలి. అలా వేసుకున్న గులాబ్ జామున్‌లను గంటపాటు అలానే ఉంచుకోవాలి. అప్పుడే షుగర్ జామున్‌కు సరిగ్గా పట్టుకొని, టేస్టీగా తయారవుతుంది.
కొబ్బరి లడ్డూలు:
ఈ కొబ్బరి లడ్డూలను పండగ సమయంలోనే కాక.. సాధారణ రోజుల్లో కూడా చేసుకోవచ్చు. ఈ లడ్డూలు తయారీకి.. నెయ్యి, కొబ్బరి తురుము, పాలు, యాలకుల పొడి, పంచదార, డ్రై ఫ్రూట్స్ అవసరమవుతాయి. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ముందుగా స్టవ్ వెలిగించి, ఓ కడాయిలో నెయ్యి పోసుకొని కొబ్బరి తురుమును అందులో వేసుకోవాలి.
ఈ తురుము కాస్త రంగు మారి, మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో కాచిన పాలు, పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. అనంతరం అందులోనే ఏలకుల పొడి వేసుకొని మిశ్రమం చిక్కబడే వరకు అలాగే ఉంచుకోవాలి. అది చిక్కబడిన తరువాత గోరు వెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అనంతరం వాటిపై డ్రై ఫ్రూట్స్ తురుము చల్లుకుంటే సరిపోతుంది. కొబ్బరి లడ్డూ సిద్ధమైనట్లే. ఈ దీపావళికి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications