For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ కచోరి : మాన్ సూన్ స్నాక్ రిసిపి

|

వర్షాకాలంలో సాయంత్రంలో వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. వేడివేడిగా ఒక కప్పు టీతో ఒక ప్లేట్ హాట్ కచోరిలు లేదా సమోసాలు చాలా మంచి కాంబినేషన్. వర్షకాలంలో ఈ కాంబినేసన్ చాలా ఫర్ఫెక్ట్ కాంబినేసన్ . సాధారణంగా వర్షకాలంలో స్ట్రీస్ట్ ఫుడ్స్ లోఎక్కువ అందుబాటులో కచోరిలు మరియు సమోసాలుంటాయి . వీటిని మనం ఇంట్లోనే మరింత టేస్ట్ గా హెల్తీగా తయారుచేసుకోవచ్చు. మరి వీటిని ఎలా తయారుచేయాలి ఏఏ పదార్థాలు అవసరం అవుతాయో చూద్దాం...

aloo kachori


కావల్సిన పదార్థాలు
గోధుమ పిండి: 3cups
రవ్వ: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
బేకింగ్ సోడ: ఒక చిటికెడు
నూనె: 2tbsp

స్టఫింగ్ కోసం:
బంగాళదుంప: 4(బాయిల్ చేసి, మ్యాష్ చేసినవి)
అల్లం: 1tsp(తురుము)
జీలకర్ర: 1tsp
ధనియాలపొడి: 1tsp
ఆమ్ చూర్(డ్రై మ్యాంగో పౌడర్): 1tsp
గరం మసాలా పౌడర్: 1tsp
నూనె: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా గోధుమపిండి, రవ్వ, ఉప్పు, నూనె, బేకింగ్ సోడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. తర్వాత అందులో గోరువెచ్చని నీళ్ళు సోపి పిండిని మెత్తగా కలుపుకోవాలి.
2. అలా కలపుకొన్న పిండి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక చెంచా నూనె వేడసి చేసి అందులో జీలకర్ర వేసి కొన్ని సెకండ్లు ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత సన్నగా తురిమిన అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆమ్ చూర్ పౌడర్, గరం మసాలా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని పక్కన పెట్టుకోవాలి
5. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్దిగా నిమ్మకాయ సైజులో తీసుకొని గుండ్రంగా చేసి చేతిలో పెట్టుకొని ఫ్లాట్ గా వత్తుకోవాలి.
6. అలా కట్ లెట్ లా వత్తుకొన్న పిండిని అరచేతి దగ్గర గుంతలా చేసి స్టఫింగ్ కోసం సిద్దం చేసుకొన్న మిశ్రమాన్ని అందులో వేసి స్టఫ్ చేసుకోవాలి.
7. తర్వాత అన్ని వైపులా చేతి వేళ్లతోనే ప్రెస్ చేస్తూ లోపలి స్టఫ్ పదార్థం బయటకు రాకుండా క్లీన్ గా క్లోజ్ చేయాలి . అలా అన్ని వైపులా క్లోజ్ చేసిన తర్వాత మరల అరచేతిలో పెట్టి ప్లాట్ గా ప్రెస్ చేయాలి.
8. తర్వాత వీటిని చపాతీ కర్రతో చిన్న పూరీల్లా రోల్ చేసుకోవాలి.
9. ఇలా అన్నీ తయారుచేసుకొన్న తర్వాత, స్టౌ మీద డీప్ ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి కాగనివ్వాలి.
10. నూనె వేడి అయ్యాక అందులో కచోరిలను వేసి అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోని మార్చుకొని వేడి వేడి గా సర్వ్ చేయాలి. మీకు నచ్చిన కర్రీ, లేదా చట్నీతో వర్షకాలంలో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి.

English summary

Aloo Ki Kachori: Monsoon Snack Recipe

Rainy season always makes us crave for some fried snacks. A cup of hot, piping tea with a plate of hot kachoris or samosas is a perfect way to spend a rainy evening in India. We usually tend to buy kachoris and samosas from the market but isn't it even better if you can prepare these crispy delights at home?
Story first published: Monday, October 5, 2015, 16:54 [IST]
Desktop Bottom Promotion