For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అటుకుల లడ్డు-కృష్ణాష్టమి స్పెషల్

అటుకుల లడ్డు-కృష్ణాష్టమి స్పెషల్

|

Atukula Laddu
కృష్ణాష్టమిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. చిన్ని కృష్ణున్ని తమ ఇళ్లకు ఆహ్వానిస్తూ పడతులు కృష్ణ పాదాలు వేస్తారు. బాలకృష్ణుడు తమ ఇంట అడుగుపెడితే సకలశుభాలు కలుగుతాయని భావిస్తారు. ఉదయమంతా పూజాది కార్యక్రమాల్లో సాయంత్రం ఉట్టి కొడతారు. ఈ వేడుకల్లో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొంటారు. యువకులు ఉట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా, యువతులు దాన్ని వారికి అందకుండా పైకి లాగుతారు. ఉట్టి కొట్టిన తర్వాత ప్రసాదాలు పంచుతారు.

ఆ ప్రసాదాలలో తప్పనిసరిగా అటుకులతో చేసి వెరైటీలే కనబడుతాయి. అటుకులంటే అంత ఇష్టం కృష్ణునికి. కుచేలుడి సంగతి కృష్ణునికి తెలియదా...?కాని - అటుకులు పట్టుకొస్తే తప్ప కరుణించలేదు..! గోప వనితలు ఎంత ఆరాధిస్తే ఏం?పాల కడవలో, వెన్న కుండలో సమర్పించాల్సిందే కదా!తల్లి యశోద కొసరి కొసరి ఎన్ని తినిపించిందో కాని, ఆ నల్లగోపయ్య భక్తుల చిట్టి ప్రసాదం చూస్తే మురిసిపోతాడు. తన సాక్షాత్కారంతో మెరిసిపోతాడు. ఈ కృష్ణుడి పుట్టినరోజున..చిట్టి పాదాలతో నడిచి వచ్చే ఆ స్వామికి ఇష్టమైన అటుకులతో ఈ తీపి వంటకం సమర్పిద్దాం...

అటుకులు: 1cup
బెల్లం తురుము: 1/2cup
కొబ్బరి తురుము: 1/2cup
నెయ్యి: 2tbsp
జీడిపప్పు: 6
కిస్ మిస్: 10
యాలకులపొడి: 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ వెలిగించి మందపాటి పాన్ స్టౌ మీద పెట్టి అటుకులు వేసి లేత బంగారువర్ణంలోకి మారేవరకూ వేయించాలి. తర్వాత క్రింది దింపుకొని చల్లారనివ్వాలి.
2. తర్వాత వేయించిన అటుకులను, కొబ్బరి తురుము, యాలకులు, జీడిపప్పును మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులో బెల్లం తురుము కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ గ్రైడ్ చేసుకోవాలి.
4. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోని తీసుకొని నెయ్యి, కిస్ మిస్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా చేతిలోనికి తీసుకొని లడ్డులా వత్తుకోవాలి. అంతే కృష్ణాష్టమి స్పెషల్ అటుకు లడ్డు రెడీ...

English summary

Atukula Laddu Krishna Krishnashtami Special | అటుకుల లడ్డు-కృష్ణాష్టమి స్పెషల్

On the occasion of Janmashtami, people relish on umpteen varieties of dishes. Explore recipes of some popular dishes prepared on the festival.
Desktop Bottom Promotion