For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీకార్ప్ మంచూరియా

|

Baby Corn Manchurian
కావలసిన పదార్ధాలు:
బేబీకార్న్: 5
మొక్కజొన్న పిండి: 1/2cup
బియ్యం పిండి: 1/4cup
కారం: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: కావలసినంత
కొత్తిమీర: 1cup(కట్ చేసి పెట్టుకోవాలి)
ఉల్లికాడలు: 1కట్ట(సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి)
వెల్లుల్లి పలుకులు: 5
సోయా సాస్: 1tsp
టమాటా సాస్: 1tsp
జీడిపప్పు, పల్లీలు పొడి: 2tbsp

తయారు చేయు విధానము:
1. బేబీకార్న్‌ ను ఒకే సైజులో తరిగి..ఉప్పు నీటిలో ఉడికించాలి.
2. ఇప్పుడు మొక్కజొన్న, బియ్యంపిండి, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసి మరో పాత్రలో బజ్జీలపిండిలా కలపాలి. ఇందులో ఉడికించిన బేబీకార్న్‌ను ముంచి బజ్జీల మాదిరి వేయించాలి.
3. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లులి పలుకులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపొరక ముక్కలు వేసి ఎర్రగా వేగనివ్వాలి.
4. అందులో ముందే వేయించి పెట్టుకున్న బేబీకార్న్‌ ముక్కల్ని ఒక్కోటి చొప్పున ఉంచాలి.
5. ఫైనల్ గా పైన సోయా సాస్, చిల్లీ సాస్‌, టమాటా సాస్‌, ఇంకాస్త ఉప్పు, ఆపై జీడిపప్పు, పల్లీల పొడి,కొత్తిమీర గార్నిష్ గా చల్లితే వేడివేడి బేబీకార్న్‌ మంచూరియా రెడీ.

Story first published:Wednesday, August 25, 2010, 16:13 [IST]
Desktop Bottom Promotion