For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బనాన & పీనట్ బటర్ మిల్క్ షేక్ రిసిపి

|

మిల్క్ షేక్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గొప్పగా ఆరోగ్య ప్రయోజనాలను అంధిస్తాయి. ముఖ్యంగా ఉదయం తీసుకొనే మిల్క్ షేక్స్ వల్ల శరీరానికి అవసరం అయ్యే పూర్తి పోషకాలు అందజేస్తాయి.

అటువంటి మిల్క్ షేక్స్ లో ఒకటి బనానబట్టర్ మిల్క్ షేక్. ముఖ్యంగా బరువు తగ్గాలనే ప్లాన్ లో ఉన్నవారు, బనాన బటర్ మిల్క్ షేక్ తీసుకోవడం వల్ల రోజంతా పొట్టను ఫుల్ గా నింపినట్లు అవుతుంది. ఎక్కువ ఆకలి కలిగించదు. దాంతో ఇతర ఆహార పదార్థాలను తీసుకోవలనే కోరిక, ఆలోచనలు మనస్సులో రానివ్వవు. ఎందుకంటే అరటి పండ్లలో ఉండే అధిక ప్రోటీనుల్లు, పొటాషియం, మరియు మంచి కార్బోహైడ్రేట్స్ అందుకు బాగా సహా పడుతాయి.

Banana & Peanut Butter Milkshake Recipe

కావల్సిన పదార్థాలు:
అరటి పండు: 1(చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
పీనట్ బటర్: 2tbsp
పాలు : 1cup(బాగా మరిగించి వెన్నతీసిన పాలు)
ఐస్ క్యూబ్స్: 4
ప్రోటీన్ పౌడర్: 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ముందుగా మిక్సీ జార్ లో కొద్దిగా పాలు పోయాలి, తర్వాత అందులోనే అరటిపండును ముక్కలుగా కట్ చేసి వేయాలి.
2. ఈ రెండింటి మిశ్రమంతో రెండు సెకండ్లు గ్రైండ్ చేసుకోవాలి, అరటిపండు పూర్తిగా మెత్తబడే వరకూ బ్లెడ్ చేసుకోవాలి.
3. తర్వాత అందులోనే పీనట్ బరట్, కొద్దిగా పాలు మరియు ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి అన్నింటిని గ్రైండ్ చేసుకోవాలి.
4. తర్వాత మిక్సీ మూత తీసి అందులో మిల్క్ షేక్ ప్రోటీన్ పౌడర్ వేసి మరో రెండు సెంకడ్లు బ్లెడ్ చేయాలి . ఈ మిల్క్ షేక్ మరీ చిక్కగా ఉంటే మరికొద్దిగా పాలను మిక్స్ చేసుకోవాలి. అంతే బనాన పీనట్ బటర్ మిల్క్ షేక్ రెడి.

English summary

Banana & Peanut Butter Milkshake Recipe

Your breakfast is the most important meal of the day and when on a weight loss, it should not be skipped. Skipping a meal when you are wanting to lose weight will only make you feel tired. This banana and peanut butter milkshake for weight loss will also make your tummy full since banana is high in proteins and good carbs.
Story first published: Thursday, May 29, 2014, 17:55 [IST]
Desktop Bottom Promotion