For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీరకాయ బజ్జీ: మాన్ సూన్ స్పెషల్

|

స్పైసీ ఇండియన్ హాట్ స్నాక్స్ లో వివిధ రకాలున్నాయి. వాటిలో మిర్చి బజ్జీ, ఆలూ బోండా, క్యాప్సికమ్ బజ్జీ, ఆనియన్ బజ్జీ ఇలా వివిధ రకాలున్నాయి. అయితే అందులో మరో అద్భుతమైన ఈవెనింగ్ స్నాక్స్ రిసిపి కూడా ఉందే అదే బీరకాయ బబ్జీ ఎక్కువ కారం ఇష్టపడని వారు, కమ్మగా ఉండే నేతిబీరకాయతో బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ లో అతి త్వరగా, సులభంగా తయారు చేసుకొనేది ఈ బీరకాయ బజ్జీయే.

వర్షాకాలంలో సన్నని వర్షపు జల్లుల మధ్య వేడి వేడి బీరకాయ బజ్జీ భలే రుచిగా కమ్మగా ఉంటుంది. బీరకాయ బజ్జీ అంటే ఇష్టపడని వారుండరు. అయితే కొంత మంది మాత్రం ఈ బీరకాయ బజ్జీని తినడానికి ఎక్కువగా ఇష్టపడరు, చేసే విధానంలో కొద్దిగా మార్పు చేసుకొన, తర్వాత కొద్దిగా కారంగా చేసుకుంటే, వర్షకాలంలో చాలా రుచికరంగా ఉండి, ఈవెనంగ్ స్నాక్ కోరికలను తీర్చుతాయి. మరి ఈ స్పైసీ బీరకాయ బజ్జీని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Beerakaya(Ridge gourd) Bujji: Monsoon Special

కావలసిన పదార్థాలు:

బీరకాయలు: 2
సెనగపిండి: 1cup
బియ్యప్పిండి: 1/2cup
నూనె: 2 cups
వంటసోడా: చిటికెడు
కారం: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
జీలకర్ర పొడి : 1tsp

తయారుచేసే విధానం

1. ముందుగా బీరకాయలు తొక్కు తీసి చక్రాల్లా కోసుకోవాలి.(చేదు లేకుండా చూసుకోవాలి)
2. బియ్యప్పిండి, సెనగపిండి, ఉప్పు, కారం, సోడా కలిసి నీళ్లు పోసి జారుగా కలపాలి.
3. స్టవ్‌మీద పాన్ పెట్టి నూనె పోసి బాగా కాగిన తరవాత ఒక్కో బీరకాయ ముక్కని సెనగపిండిలో ముంచి నూనెలో వేయించాలి. ఎర్రగా వేయించి తీశాక టొమాటో సాస్‌తో వడ్డించాలి. అంతే బీరకాయ బజ్జీ రెడీ.

English summary

Beerakaya(Ridge gourd) Bujji: Monsoon Special


 Want to know how to prepare ridge gourd bajji in easy way? Here is the simple way. Check out and give it a try...
Story first published: Monday, August 4, 2014, 17:38 [IST]
Desktop Bottom Promotion