For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దానిమ్మ-ఆరెంజ్ తో క్యారెట్ జ్యూస్: హెల్తీ అండ్ న్యూట్రిషన్

|

Carrot Juice Recipe With Orange/Pomegranate
మనం ప్రతిరోజు తినే కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటిని అశ్రద్ద చేయకుండా తింటుంటే పలు అనారోగ్యాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. కళ్ళు, చర్మం, జుట్టు, పళ్ళు ఇవన్నీ అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్ తింటే చాలు. క్యారెట్‌లో ఉండే ఫైటో కెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. మన జీవితం నిత్యం ఒత్తిడికి గురవుతుంది ముఖ్యంగా సాయంత్రం అయ్యేసరికి శరీరం, మనసూ రిలాక్స్ కావాలంటే ఒక గ్లాసు చల్లటి క్యారెట్ జ్యూస్‌ని తీసుకోవాలి. క్యారెట్‌లో ఉన్న పీచుపదార్ధం జీర్ణశక్తిని వృద్ది చేస్తుంది. చిన్న పిల్లలకు ఉదయాన్నే రెండు పచ్చి క్యారెట్లు ఇచ్చి తినమని చెప్పాలి. పచ్చి క్యారెట్లు తినటం వల్ల కంటి చూపుకి శక్తినిచ్చే విటమిన్ 'ఎ' సమకూరుతుంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్యారెట్‌ని తినవచ్చు. పచ్చివి ఇష్టపడనివారు వాటిని ఉడకబెట్టుకొని తినవచ్చు.

కావలసిన పదార్థాలు:
క్యారెట్: 4-5
ఆరెంజ్: 2
దానిమ్మ: 1
ఉప్పు: చిటికెడు
నీళ్ళు: తగినన్ని
పూదినా ఆకులు
పంచదార: 1tbsp(అవసరం అనుకొంటే)

తయారు చేయు విధానము:
1. మొదటగా క్యారెట్ తీసుకొని శుభ్రమైన నీటి కడగాలి. తర్వాత కొన, మొదలు కట్ చేసి పై కవచాన్ని(పొట్టు)ని తీసేయాలి. ఇప్పుడు మళ్లీ నీటితో కడిగి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఆరెంజ్ పైకవచం(పొట్టు)ను తొలగించి ఆరెంజ్ తొనలను విడివిడిగా తీసి పక్కన పెట్టుకోవాలి.
3. అలాగే దానిమ్మ కాయను వలిచి కాయనుండి గింజలను వేరు చేసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు జూసర్ లో క్యారెట్ ముక్కలు, ఆరెంజ్ తొనలు, దానిమ్మ గింజలు వేసి, కొద్దిగా నీళ్ళు పోసి గ్రైండ్ చేసి జూస్ తీసుకోవాలి.
5. అవసరం అనుకొంటే కొద్దిగా పంచార మిక్స్ చేసుకోవచ్చు. అంతే క్యారెట్-ఆరెంజ్, దానిమ్మ జూస్ రెడీ..పుదీనా ఆకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయడమే ఆలస్యం..

English summary

Carrot Juice Recipe With Orange/Pomegranate | దానిమ్మ-ఆరెంజ్ తో క్యారెట్ జ్యూస్

Carrot juice is a healthy and nutritious juice which is beneficial for the body and skin. To get glowing skin free from dark spots or marks, have carrot juice everyday. Carrot juice recipe is very easy and few other fruits such as orange or pomegranate can be used to get a different taste! Take a look at the healthy carrot juice recipe.
Story first published:Friday, October 7, 2011, 15:44 [IST]
Desktop Bottom Promotion