For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చీజ్ కట్ లెట్: రుచికరమైన స్నాక్ రిసిపి

|

చీజ్ కట్ లేట్ రిపిసి ఒక ఫర్ ఫెక్ట్ స్నాక్ రిసిపి. చీజ్ తో నింపి తయారుచేసిన ఈ రుచికరమైన కట్ లెట్ అంటే పిల్లలకు కూడా మహా ఇష్టం. ఇక వేళ మీరు డైట్ లో ఉన్నా కూడా, వారంలో ఒక రోజు మినహించి ఈ చీజ్ కట్ లెట్ ను ఆరగించేయవచ్చు. కడుపు నింపే ఈ రుచికరమైన చీజ్ కట్ లెట్ తయారుచేయడం చాలా సులభం. ఈ చీజ్ కట్ లెట్ తయారుచేయడానికి, పన్నీర్ కూడా ఉపయోగించుకోవచ్చు.

ఈ చీజ్ కట్ లెట్ రిసిపికి ప్రధానంగా కావల్సింది, కాటేజ్ చీజ్, చీజ్, బ్రెడ్ పొడి, మరియు గుడ్డు. ఈ రిసిపి మీ సమయాన్ని ఆధా చేస్తుంది. మరి ఈ సింపుల్ స్నాక్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం...

Cheese Cutlet

కావల్సిన పదార్థాలు:
కాటేజ్ చీజ్: 2-3 cups
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 ½tbsp
కారం: 2tsp
పసుపు: 1tsp
పచ్చిమిర్చి: 2 (చిన్నగా సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 1 పెద్దది (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
చీజ్: 4-5tbsp
గుడ్డు: 1 (పగులగొట్టి, మిశ్రమాన్ని కప్పులో వేసుకోవాలి)
బ్రెడ్ ముక్కలు:1cup
నూనె: 2cups
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా కాటేజ్ చీజ్ ను ఒక మీడియం సైజ్ బౌల్లో వేసుకోవాలి. తర్వాత మీ చేతులను శుభ్రంగా కడుకొని, మీ చేత్తో కాటేజ్ చీజ్ ను మెత్తగా కలుపుకోవాలి. 2. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు , పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ, చేత్తో కలుపుకోవాలి.
3. ఇప్పుడు అందులో చీజ్ కూడా వేసి, తిరిగి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఫ్లాట్ బాల్స్ గా తయారుచేసుకొని పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టౌ మీద డీఫ్ బాటమ్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి, నూనె పోసి, మీడియం మంట మీద కాగనివ్వాలి.
5 ఇప్పడు ఫ్లాట్ బాల్స్ గా చేసిన పెట్టుకొన్న చీజ్ మిశ్రమ బాల్స్ ను బాగా గిలకొట్టి పెట్టుకొన్న గుడ్డు మిశ్రమంలో డిప్ చేయాలి. తర్వాత ఒక ప్లేట్ లో బ్రెడ్ పొడి వేసి, ఎగ్ లో డిప్ చేసిన బాల్స్ ను బ్రెడ్ పొడిలో పొర్లించాలి. అన్నివైపులా అంటుకొనే విధంగా చూసుకోవాలి.
6. ఇప్పుడు వీటిని కాగే నూనెలో వేసి మీడియం మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
7. ఈ చీజ్ బాల్స్ బ్రౌన్ కలర్ రాగానే పేపర్ టవల్ మీద వేసి, అదనపు ఆయిల్ ఇంకిపోయే వరకూ ఉండనిచ్చి, తర్వాత సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేయాలి.
ఈ చీజ్ కట్ లెట్ ను వేడివేడి గా టమోటో, చిల్లీ సాస్ తో మరియు కొంచెం గ్రీన్ సలాడ్ తో సర్వ్ చేయండి . ఈ కాంబినేషన్ లో కట్ లెట్స్ మరింత టేస్ట్ ఉంటాయి.

English summary

Cheese Cutlet: A Cheesy And Yummy Recipe

Cheese cutlet is just the perfect recipe for a Snack. This yummy cheese filled cutlet recipe will also be liked by the children. Moreover even if you are a diet freak then Sundays do ask for an exception.
Story first published: Monday, November 25, 2013, 18:01 [IST]
Desktop Bottom Promotion