For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిస్మస్ స్పెషల్ బనానా చాకో చిప్స్ మఫిన్ రిసిపి

|

క్రిస్‌మస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది క్రిస్‌మస్ ట్రీ. పిల్లలకయితే క్రిస్‌మస్ తాత గుర్తుకువస్తాడు. ఇంకా ఏం గుర్తుకువస్తాయి అని అడిగితే...ప్రశ్న పూర్తవకుండానే జవాబు వచ్చేస్తుంది. నోరూరించే కేకులని. ఒకటి రెండూ కాదు ఆ సమయంలో బోలెడు రకాల కేకులు కెవ్వుమని కేక వేస్తాయి. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా చాకులతో రెడీ అయిపోతారు.

క్రిస్‌మస్‌ని కేకుతో ఆహ్వానిస్తారు. తియ్యగా సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ అంటే ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సమయం. క్రిస్మస్‌కి కేకులు తయారుచేసి వచ్చిన అతిథులకే కాక దూరాన ఉన్న వారికి సైతం ఆర్డర్ చేసి మరీ అందచేస్తారు. కొందరు మాత్రం ఇంట్లో చేసుకోవాలనుకుంటారు. అందుకే ఇక్కడ మీకోసం ఒక బనానా చాకో చిప్ రిసిపిని తయారుచేసే విధానంతో అంధిస్తున్నాం. ఈ స్పెషల్ బనానా చాకో చిప్ రిసిపిని మీరు కూడా ప్రయత్నించి మీ క్రియేటివిటీని జోడించి డెకొరేట్ చేయండి...కేక్ కట్ చేసి ఇంటికి వచ్చిన అతిథులకు క్రిస్మస్ శుభాకాంక్షలను తీయగా అందించండి...

Christmas Spcl Banana Choco Chips Muffin Recipe

కావల్సినపదార్థాలు:
అరటిపండ్లు - 3 (బాగా పండినవి)
ఛాకోచిప్స్ - 1 cup
గుడ్లు - 2
బట్టర్ - 2 tbsp
వెనీలా ఎసెన్స్ - 1/4th tsp
బనానా ఎసెన్స్ - 1/4thtsp
మైదా - 2 cups
బేకింగ్ సోడా - 1/4th tsp
బేకింగ్ పౌడర్ - 1/4th tsp
పంచదార - 2 cups

మీ ఆత్మీయుల కోసం క్రిస్మస్ కు ఎలాంటి గిప్ట్స్ ఎంపిక చేసుకోవాలి...?

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరటిపండు ముక్కలు వేసి మెత్తగా మ్యాష్ చేయాలి. బాగా పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకవోాలి.
2. తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో గుడ్డు, వెనీలా ఎసెన్స్, మరియు బట్టర్, వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. అదే బౌల్లో మైదా, బనానా ఎసెన్స్, బేకింగ్ సోడా మరియు పంచదార వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
4. ఇప్పుడు ఇందులో మ్యాష్ చేసిన బనానా మిశ్రమాన్ని వేయాలి .
5. అలాగే చాకోచిప్స్ ను కూడా అందులో వేయాలి. తర్వాత మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
6. ఇప్పుడు స్కూప్ తీసుకొని , అందులోనికి ఈ బనానా మిక్స్ ను వేసి మఫిన్ మోల్డ్ లో అమర్చాలి.
7. తర్వాత ఓవెన్ లో 20 నిముషాలు పెట్టి 150డిగ్రీల్లో ఉంచి, హీట్ చేయాలి.
8. టైమ్ అయిన తర్వాత ఓవెన్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని వేడిగా లేదా చల్లగా కుటుంబ సభ్యులతో పాటు క్రిస్మస్ వచ్చిన అథితులను ఆతిద్యం ఇవ్వాలి . అంతే టేస్టీ మఫిన్ రిసిపిలు రెడీ.

English summary

Christmas Spcl Banana Choco Chips Muffin Recipe

The best part about the Christmas season is the yummy sweet treats that you can get to eat throughout the season like the cakes and muffins. So, get ready to prepare some of the best recipes for this Christmas season. As a part of Christmas special recipes, today we shall share with you an easy banana and choco chip muffin recipe.
Story first published: Wednesday, December 16, 2015, 17:14 [IST]
Desktop Bottom Promotion