For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిస్మస్ స్పెషల్: బాదం చీజ్ బిస్కెట్స్

|

మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ రాభోతోంది.జాయ్ ఫుల్ అండ్ కలర్ ఫుల్ ఫెస్టివల్ ఇది. ఈ స్పెషల్ అకేషన్ కు వివిధ రకాల వంటలతో నూరు తీపిచేసుకుంటుంటారు. అలాంటి వంటల్లో బిస్కెట్స్ కూడా ఒకటి. ఈ మాట వింటే అందరిక నోళ్ళు ఊరాల్సిందే..

క్రిస్మస్ కు డిఫరెంట్ టైప్ కేక్స్, మఫిన్స్, మరియు ఇతర బిస్కెట్స్ తయారుచేయడం కొంత మంది ఇల్లలో అనవాయి . బిస్కెట్స్ తయారుచేయడం చాలా సులభం మరియు వీటి తయారుచేయడానికి కూడా తక్కువ సమయం పడుతుంది . బిస్కెట్స్ ను వివిధ రకాలుగా తయారుచేస్తారు. అలాంటి వాటిలో చీజ్ అండ్ బాదం బిస్కెట్ రిసిపి ఒకటి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Christmas Special: Almond Cheese Biscuit Recipe

కావల్సిన పదార్థాలు:
గోధుమపిండి - 2 cups
చీజ్ తురుము - 1 cup
బాదం - 1 cup (సన్నగా తురుముకోవాలి)
పంచదార - 1/4th cup
బట్టర్ - 1/2 cup
పాలు - 1/2 cup
బేకింగ్ సాల్ట్: 1/4tsp

తయారుచేయు విధానం:
1. ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమపిండి, బట్టర్, ఫైన్ షుగర్ మరియు బేకింగ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత చీజ్ మరియు బాదం తురుము కూడా అందులో వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు అందులోనే పాలు వేసి మొత్తం మిశ్రమాన్ని పిండిని మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కలిపి పెట్టుకొన్ని మిశ్రమాన్ని పోసి ఒక అంగుళం మందంగా ఒకే లెవల్లో పాన్ మొత్తం సర్ధాలి .
5. ఇప్పుడు కుక్కీస్ కటర్ ఉపయోగించి పిండిని సమంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బిస్కెట్ ట్రే లేదా బేకింగ్ ట్రేలోకి మార్చుకోవాలి.
6. ఈ ట్రేను ఓవేన్ లో పెట్టి 180డిగ్రీల్లో 15-18నిముషాలు బేక్ చేసుకోవాలి.
7. 15 నిముషాలు అయిన తర్వాత ఓవెన్ లో నుండి బస్కెట్స్ ను బయటకు తియ్యాలి. అంతే సర్వింగ్ ప్లేట్ లో అమర్చి ఇంట్లో వారికి మరియు అథితిలకు సర్వ్ చేయాలి.

English summary

Christmas Special: Almond Cheese Biscuit Recipe

There is just a week more to go for the most colouful and joyous festival. Yes that's Chritmas!! So, on this special occasion, we are sharing our secret on how to prepare yummy cream biscuits. Well, that sounds just wonderful!
Story first published: Saturday, December 19, 2015, 15:31 [IST]
Desktop Bottom Promotion