For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోకోనట్ ఐస్ క్రీమ్

|

Coconut Ice Cream
కావలసిన పదార్థాలు:
కొబ్బరికాయ: 1
పాలు: 11/2 ltr
పంచదార: 1cup
నిమ్మరసం: 1/2tsp
మ్యాంగో సాస్: కావలసినంత

తయారు చేయు విధానము:
1. మొదట కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. సగం కొబ్బరి తురుమికి నాలుగు టీస్సూన్ల పాలు కలిపి మిక్సీలో మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మిగిలిన కొబ్బరిని కూడా మిక్సీలో వేసి పాలు తీయాలి.
2. ఇప్పుడ ఆ పాలల్లో పంచదార వేసి స్టౌ మీద పెట్టాలి. పంచదార కరిగి పాలు మరుగుతుండగా, మెత్తగా చేసుకున్న కొబ్బరి, కొబ్బరి పాలను అందులో వేయాలి. కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
3. ఈ మిశ్రమం చిక్కగా అయిన తర్వాత దించేసుకుని, చల్లారాక ప్రిజ్ లో పెట్టుకోవాలి.
4. ఓ గంట తర్వాత తీసి మిక్సీలో మెత్తగా బ్లెండ్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి గట్టిపడిన తరువాత పైన కొద్దిగా కొబ్బరి తురుము చల్లుకుని, మ్యాంగో సాస్ వేసుకుని అరగిస్తే బాగుంటుంది. అంతే కోకోనట్ ఐస్ క్రీమ్ రెడీ.

Story first published:Monday, October 25, 2010, 12:34 [IST]
Desktop Bottom Promotion