For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోకోనట్ (కొబ్బరి)వడలు: ఉగాది స్పెషల్

|

కొత్త సంవత్సరంగా చెప్పకొనే ఉగాది కన్నడ వారికి మరియు తెలుసుగువారికి ఒక పెద్ద సాంప్రదాయకరమైన పండుగ. ఈ పండుగ అతి దగ్గరలో రాబోతోంది. ఈ పండుగకు ప్రతి ఒక్కరి ఇల్లలోనూ ట్రెడిషనల్ వంటలు ఘుమఘుమలాడుతుంటాయి. అయితే ఎప్పటిలాగే ఒకే రకమైన వంటలు పండుగ రోజు కూడా తిని బోర్ అనిపిస్తుంటే, కొంచెం వెరైటీగా కొత్త వంటలను ప్రయత్నించండి. అటువంటి వంటల్లో కొబ్బరి వడలు ఉగాదికి స్పెషల్ గా ఉంటాయి.

కొబ్బరి వడలను రవ్వ ఉపయోగించకుండా, బియ్యం పిండి జోడించి తయారుచేస్తార. అయితే, ఈ వంటలో బియ్యంపిండి స్థానంలో సూజిని చేర్చబడింది. అంతే కాదు, ఈ వడలకు ముఖ్యమైన పదార్థం కొబ్బరి తురుము. కొబ్బరి తురుము నుండి స్వీట్ రుచిగా మరియు పచ్చిమిర్చి ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ కొబ్బరి వడలను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Coconut Vadas: Spcl Ugadi Recipe

కావల్సిన పదార్థాలు:

కొబ్బరి: 2 cups(తురిమినది)
సూజి: ½cup
శెనగపిండి: ½cup
ఆవాలు: 1tsp
పచ్చిమిర్చి: 7(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కరివేపాకు: రెండు రెమ్మలు(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
నెయ్యి: 1tbsp
నూనె: 2 cups
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా కొబ్బరి తరుగు, శెనగపిండి మరియు సూజి రవ్వ ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మూడింటిని బాగా మిక్స్ చేయాలి.
2. ఇప్పుడు అందులో అరకప్పు నీళ్ళు పోసి ఉండలు లేకుండా చిక్కగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసి, వేడి చేయాలి. వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఒక సెకను వేగించుకొన్న తర్వాత వీటిని కలిపి పెట్టుకొన్న పిండిమిశ్రమంలో వేయాలి.
4. తర్వాత అందులో ఉప్పు మరియు పచ్చిమిర్చి తరుగు వేసి, చేత్తో మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ మీద ఒక డీప్ బాటమ్ పాన్ పెట్టి, ఆయిల్ వేసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత పిండిని చేతిలోకి తీసుకొని వడలులాగా తట్టుకొని కాగేనూనెలో వేసి డీప్ ఫ్రైచేసుకోవాలి.
6. అంతే కొబ్బరి వడలు రెడీ. ఈ క్రిస్పీ కొబ్బరి వడలను కొత్తమీర చట్నీ లేదా రెడ్ చిల్లీ చట్నీతో సర్వ్ చేయాలి.

English summary

Coconut Vadas: Spcl Ugadi Recipe

Ugadi is jointly the new year of Kannadigas and Telugu people. And the good news is that it is just around the corner. Every year, people celebrate Ugadi with recipes that are both traditional and novel.
Desktop Bottom Promotion