For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కలర్ ఫుల్ మిక్స్డ్ ఫ్రూట్ పుడ్డింగ్: డిన్నర్ ట్రీట్

|

మొత్తం కుటుంబ సభ్యులతో కలిసి మీరు డిన్నర్ ఎప్పుడు చేశారు? అందులోనూ ఒక మంచి డిన్నర్ ట్రీట్ ?చాలా వరకూ మనం అధిక క్యాలరీలున్న ఆహారాలు తీసుకుంటూ డిజర్ట్స్ తో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే హెల్తీగా డిజర్ట్ రెడీ చేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. అటువంటి డిజర్ట్స్ లో మిక్స్డ్ ఫ్రూట్ డిజర్ట్ పుడ్డింగ్ ఒకటి.

మీరు మిక్స్డ్ ఫ్రూట్ పుడ్డింగ్ తయారుచేయడం వస్తే డిన్నర్ మరింత ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ఫ్రూట్ డిజర్ట్ డిన్నర్ ట్రీట్ కు చాలా టేస్టీగా ఉంటుంది. అంతే కాదు హెల్తీ కూడా . వివిధ రకాల పండ్లతో పోషకాలతో ఫ్రూట్ పుడ్డింగ్ ను చాలా డిఫరెంట్ గా తయారుచేసుకోవచ్చు. అలాగే స్వీట్ మీకు నచ్చే విధంగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

Colourful Mixed Fruit Pudding: Dinner Treat

కావల్సిన పదార్థాలు:
పాలు: 500 ml
గుడ్డు: 2
కస్టర్డ్ పౌడర్: 2tbsp
బిస్కట్స్: 4
పంచదార (పొడి): ½ cup
రెడ్ జెల్లీ: 1cup
గ్రీన్ జెల్లీ: 1cup
స్ట్రాబెర్రీలు: 4(సగంగా కట్ చేసుకోవాలి)
బ్లూ బెర్రీస్: 6-8
పీచ్: 6-8
మామిడి: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
లీచీ: 4-5 (విత్తనాలు తొలగించాలి)
మాపుల్ సిరప్ : ½ cup

తయారుచేయు విధానం:
1. ముందుగా పెద్దగిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. తర్వాత అందులో కస్టర్డ్ పౌడర్, బిస్కెట్స్, మరియు గిలకొట్టి పెట్టుకొన్న గుడ్డు మిశ్రమాన్ని పోయాలి.
2. తర్వాత పాలు బాగా మరిగి 1/3కు తగ్గిన తర్వాత అందులో పంచదార వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ బౌల్ తీసుకోని అందులో చిక్కగా ఉడికించుకొన్న పాల మిశ్రమాన్నికొద్దిగా ఒక లేయర్ గా పోయాలి.
4. తర్వాత దాని మీద రెడ్ జెల్లీ, మరో లేయర్ గ్రీన్ జెల్లీ పోయాలి. తర్వాత ఫ్రూట్స్ కూడా సర్దాలి.
5. తర్వాత తిరిగి మరో లేయర్ చిక్కటి పాల మిశ్రమాన్ని పోయాలి. ఇలా పదార్థాలన్ని పూర్తయ్యే వరకూ అన్నింటిని లేయర్స్ గా పోసుకోవాలి.
6. ఇలా మొత్తం తయారుచేసుకొన్నాక ఈ గ్లాస్ బౌల్ ను ఫ్రిజ్ లో పెట్టి కనీసం 2 గంటలు ఉంచాలి. అంతే పుడ్డింగ్ రెడీ అవుతుంది.
7. రెండు గంటల తర్వాత బయటకు తీసి గ్లాస్ బౌల్ ను రివర్స్ లో పెట్టి, పుడ్డింగ్ ను ప్లేట్ లోకి వంపుకోవాలి. తర్వాత దాని మీద మాప్లే సిరఫ్ ను పోయాలి. అంతే చివరగా మిక్స్డ్ ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి డిన్నర్ కు చల్లచల్లగా సర్వ్ చేయాలి.

English summary

Colourful Mixed Fruit Pudding: Dinner Treat

How long has it been since you gave your family a treat after dinner? Most of the time, we get totally worked up about calories and do not enjoy desserts as much as we should. Besides, it is tough to make desserts especially when you are a working couple with a tight work schedule. However, a little extra effort to try this mixed fruit pudding will give your family a surprise treat after dinner. The recipe for mixed fruit pudding is really easy.
Story first published: Thursday, June 5, 2014, 17:54 [IST]
Desktop Bottom Promotion