For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెస్ట్ ఈవెనింగ్ స్నాక్: క్రిస్పీ పల్లీ పకోడీ

|

Crispy Palli Pakodi
పల్లీలు ఈవెనింగ్ తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. సాధారణంగా పల్లీలతో వివిధ రాకల స్నాక్స్ తయారు చేస్తుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇష్టమైన చిరుతిండ్లున వంటి ఇస్తుంటారు. పెద్దలకూడ కారం పెట్టుకొని తినడం, లేదా వేసుకొని తినడం, లేదా ఉప్పకలిపిన పల్లీలు ఇలా వారికి నచ్చిని విధంగా తయారు చేసుకొని తింటుంటారు. ఇవి రుచికి మాత్రమే కాదు ఆరోగ్య పరంగాను చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పల్లీలను కొంచెం వెరైటీగా పకోడీ లా చేసి తింటే మరోకొత్త రుచి అందిస్తుంది. మరి ఈ పల్లిపకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
పల్లీలు: 2cups
శెనగపిండి: 1.5cup
కరివేపాకు: మూడు రెమ్మలు
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
ఉప్పు: రుచికి తగినంత
మిరపపొడి: 1tsp
ధనియాలపొడి: 1/2tsp
గరంమసాలా: 1/2tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
కొత్తిమీర: చిన్న కట్ట

తయారు చేయు విధానం:
1. ముందుగా పల్లీలను నూనె లేకుండా వేయించి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి.
2. తర్వాత ఒక గిన్నెలో శనగపిండి, కరివేపాకు, ఉప్పు, మిరపపొడి, గరం మసాలా, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, వేయించి ఉంచుకున్న పల్లీలు, తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి.
3. తర్వాత పాన్ లో నూనె కాగిన తరవాత పల్లీలను పకోడీల మాదిరిగా నూనెలో వేసి కరకరలాడే వరకు వేయించి, టిష్యూ పేపర్ మీదకు తీసుకోవాలి. దీనిని పల్లీ చట్నీ కాంబినేషన్‌తో సర్వ్ చేయాలి. అంతే పల్లీ పకోడీ రెడీ..

English summary

Crispy Palli Pakodi | క్రిస్పీ పల్లీ పకోడీ

Masala Palli Or Palli Pakodi Recipe made easy with Masala Palli. very yummy and tasty palli pakoda is ready to eat....
Story first published:Thursday, December 27, 2012, 18:46 [IST]
Desktop Bottom Promotion