For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖర్జూరం కుడుములు

By Staff
|

Dates Kudumu
కావలసిన పదార్థాలు:

బియ్యపు రవ్వ : 1 గ్లాసు
పెసరపప్పు : 1/4 గ్లాసు
ఖర్జూరం : 1 గ్లాసు
కొబ్బరికాయ : సగం చెక్క
నెయ్యి : 50 గ్రాములు
యాలకుల పొడి : కొంచెం
మంచినీళ్ళు, పాలు : 3 గ్లాసులు

తయారు చేయు విధానం: ముందుగా ఒక గ్లాసు బియ్యపు రవ్వకి మూడు గ్లాసుల నీరు, పాలు కలిపి ఎసరు పెట్టుకోవాలి. నీరు మరుగుతున్నప్పుడు పెసరపప్పును వేయాలి. నీరు బాగా మరిగిన తర్వాత బియ్యపు రవ్వని పోసి ముద్దకాకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. మెత్తగా అయిన ఖర్జూరంలో కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఉడికిన బియ్యపు రవ్వలో కలపాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దలు రవుండుగా కాని, కోలగా కానీ ఒత్తుకోవాలి. ఆ తర్వాత వీటిని కుక్కర్ లో ఆవిరి మీద 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది షుగర్ పేషంట్లకు కూడా మంచింది. స్వీట్ కుడుములు వద్దనుకున్నవారు ఖర్జూరాన్ని కలుపుకోకుండా హాట్ కుడుములు కూడా చేసుకోవచ్చు.

Story first published:Friday, September 25, 2009, 10:49 [IST]
Desktop Bottom Promotion