For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెలిషియస్ హోం మేడ్ మ్యాంగో ఐస్ క్రీమ్

|

మ్యాంగో (మామిడి పండు)మనందరికీ ఫేవరెట్ ఫ్రూట్. మామిడి పండును పండ్లలో రారాజులా పిలుస్తుంటారు. అంతటి అద్భుతమైన టేస్ట్ ను, ఫ్లేవర్ ను అంధిస్తుంది. మామిడి పండును అలాగే తినడం వల్ల పూర్తి పోషకాలు, న్యూట్రీషియన్, విటమిన్లు శరీరానికి అందుతాయి. కానీ మామిడి పండ్ల సీజన్ లో మామిడి పండ్లతో కొత్త రకం రుచిలను కూడా చూడాలనిపిస్తుంది.

కాబట్టి మామిడి పండ్లు దొరికే సీజన్లో మీకు ఇష్టమైన ఒక స్నాక్ ను పరిచయం చేస్తున్నాం. ఇది పిల్లలకు పెద్దలకు అందరికీ తప్పక నచ్చే ఒక డెలిషియస్ హోం మేడ్ మ్యాంగో ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ను బయటే తినాలని లేదు, తయారు చేసే విధానం తెలుసుకుంటే మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు . చాలా వరకూ మామిడి పండ్లన్నీ తియ్యగా ఉంటాయి. అయితే కలర్ లో మాత్రం కొంచెం వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి షుగర్ వాడాల్సిన పనిలేదు. అయితే మామిడి పండ్లలో ఉండే తీపి మీకు సరిపోలేదనుకుంటే కొద్దిగా పంచదార కలుపుకోవచ్చు. మరి ఈ సీజన్ లో మామిడి పండ్లు విరివిగా దొరుకుతాయి కాబట్టి మనం ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు:

క్రీమ్ మిల్క్: 2cups

హెవీ క్రీమ్: cups

గుడ్డులోని పచ్చసొన: 8

పంచదార: 2cups

మామిడి పండు గుజ్జు: 3cups

తయారు చేయు విధానం:

1) ముందుగా పాన్ లో రెండు కప్పులు పాలు మరియు ఒక కప్పు హెవీ క్రీమ్ వేయాలి.

2) తక్కువ మంట మీద ఉంచాలి.

3)ఒకసారి అలా ఉడకగానే హీట్ నుండి పక్కకు తీసేయాలి.

తయారు చేయు విధానం:

4)ఒక బౌల్ తీసుకొని అందులో పంచదార, గుడ్డు వేసి బాగా గిలకొట్టాలి. ఈ రెండింటి మిశ్రమం క్రీమ్ లా తయారైయ్యే వరకూ గిలకొట్టాలి.

5)ఇప్పుడు ముందుగా వేడిచేసి పెట్టుకొన్న పాలను ఈ గుడ్డు పంచదార మిశ్రమంలో ఒక కప్పు పాలను పోయాలి. పాలు మిక్స్ చేసేటప్పుడు బాగా కలియబెట్టాలి.

6)మిగిలన పాలలో కూడా గుడ్డు మిశ్రమాన్ని వేసి బాగా క్రీమ్ లా తయారయ్యే వరకూ మిక్స్ చేయాలి.

తయారు చేయు విధానం:

7)ఈ మిశ్రమాన్ని స్టౌ మీద పెట్టి నిదానంగా అతి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.

8) ఎక్కువ మంట మీద ఎక్కువగా ఉడికిస్తే గుడ్డు విడిపోతుంది. కాబట్టి తక్కువ మంటమీద కలియబెడుతూ ఉడికించుకోవాలి.

9)ఉడికించుకొన్న తర్వాత క్రిందికి దింపుకొని చల్లారనివ్వాలి.

10)ఒక సారి చల్లారిన తర్వాత మిగిన రెండు కప్పుల హెవీ క్రీమ్ ను ఇందులో కలుపుకోవాలి.

తయారు చేయు విధానం:

11)ఇప్పుడు అందులోనే మామిడి గుజ్జును కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.

12)ఈ మిశ్రమాన్ని బ్రెడ్ పాన్ లో పోసి, ఫ్రీజర్ లో రెండు, మూడు గంటల సేపు పెట్టాలి.

13) మూడు గంటల తర్వాత ఫ్రిజ్ లో నుండి బయటకు తీసి మిక్సీలో వేసి బాగా బ్లెడ్ చేయాలి. ఐస్ ముక్కలన్నీ కరిపోయేలా బ్లెడ్ చేయలి. ఇలా రెండు మూడు సార్లు, ప్రతి రెండు మూడు గంటలకొకసారి చేయాలి.

14) సెట్ అయ్యేంత వరకూ ఇలా చేయాలి.

తయారు చేయు విధానం:

15)మీ వద్ద ఐస్ క్రీమ్ మేకర్ ఉంటే, ఈ మిశ్రమాన్ని ఆ బౌల్లో పోసి, ఐస్ క్రీమ్ ను తయారు చేయాలి. అంతే హోం మేడ్ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ.

English summary

Delicious Homemade Mango Ice Cream

Mango is my favorite fruit and I wait for summers so that I can have my share of this king of all fruits. Apart from eating mangoes as such, I try to incorporate it in whatever I cook to make the most of the fruit.
Story first published: Tuesday, June 25, 2013, 17:39 [IST]
Desktop Bottom Promotion