For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దిబ్బ రొట్టే

|

Dibba Rotti
కావలసిన పదార్ధాలు:
ఇడ్లీపిండి: 2cups
పచ్చిమిర్చి పేస్ట్: 2tbsp
అల్లం పేస్ట్: 2tbsp
ఆయిల్: తగినంత
ఆవాలు: 1/2tsp
ఉద్దిపప్పు: 1/2tsp
జీలకర్ర- 1/2tsp ఎండుమిర్చి: 4
కరివేపాకు: 2 రెబ్బలు
ఇంగువ: చిటికెడు

తయారు చేయు విధానము:
1. మొదటగా ఒక బౌల్ లోనికి 2 కప్పుల ఇడ్లీపిండిని తీసుకోవాలి.
2. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో ఒక టీ స్సూన్ ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఉద్దిపప్పు, పచ్చి శెనగ పప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. తర్వాత ఆవాలు వేసి చిటపటలాడక, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి పైనల్ గా చిటికెడు ఇంగువ వేసి వేయించి ప్రక్కకు తీసిపెట్టుకోవాలి.
3. ముందుగా బ్రౌల్ లో తీసిపెట్టుకొన్న ఇడ్లీ పిండికి వేయించి సిద్దంగా పెట్టుకొన్న పోపు మిశ్రమాన్ని కలిపి బాగా మిక్స్ అయ్యేలా కలిపి పెట్టుకోవాలి.
4. స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి అందులో ఒక టీస్సూన్ ఆయిల్ వేసి రెడీచేసి పెట్టుకొన్న ఇడ్లీపిండిమిశ్రమాన్ని అందులో పోసి, మూత పెట్టి తక్కువ మంటమీద ఉడకనివ్వాలి.
5. కొద్దిసేపయ్యాక మూత తీసి రెండోవైపుకు మార్చి మరికొద్ది సేపు వేడి చేయాలి ఇప్పుడు బ్రౌన్ కలర్ లో నోరూరించి రోస్ట్ కేక్ లాగా కనిపించే దిబ్బరొట్టే రెడీ. దీనిని ఒక ప్లేట్ లోనికి తీసుకొని 4 బాగాలుగా కట్ చేసి కొబ్బరి చట్నీతో సర్వచేయాలి.

Story first published:Friday, May 14, 2010, 14:59 [IST]
Desktop Bottom Promotion