For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటేబుల్ సలాడ్: సమ్మర్ సలాడ్

|

Healthy Vegetable Salad for Summer
వేసవి తాపానికి ఏంతినాల్నా తినబుద్దికాదు. కొన్ని కొన్ని పదార్థాలు తిన్నప్పుడు ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. కాబట్టి వేసవిలో వీలైనంత వరకూ సలాడ్లు తీసుకోవటం ఎంతైనా మంచిది. సలాడ్లవల్ల ఆరోగ్యం ఇనుమడించటంతో పాటు దాహార్తి కూడా తగ్గుతుంది. రకరకాల సలాడ్స్ లో వెరైటీగా వెజిటబుల్ సలాడ్...

కావలసిన పదార్థాలు:
కీరదోసకాయ ముక్కలు: 1/2cup
టమోటో ముక్కలు: 1/2cup
క్యారెట్ ముక్కలు: 1/2cup
క్యాబేజీ ముక్కలు: 1/2cup
ముల్లంగి ముక్కలు: 1/2cup
ఉల్లిపాయ ముక్కలు: 1/2cup
తరిగిన కొత్తిమీర: 2tbsp
పచ్చిమిర్చి: 4-6
వెనిగర్: 1cup
ఉప్పు: రుచికి తగినంత
కరివేపాకు: ఒక రెమ్మ

తయారు చేయు విధానం:
1. మొదటగా కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి.
2. ఒక బౌల్ తీసుకొని అందులో అన్నిరకాలు కూరగాయ ముక్కులు వేసి, అందులో ఉప్పు వేసి బాగా కలపాలి.
3. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర ముద్దను వేసి ముక్కలకు బాగా పట్టేలా మరొకసారి కలపాలి.
4. చివరగా వెనిగర్ వేసి కలిపి సర్వ్ చేయాలి. అంతే వెజిటబుల్ సమ్మర్ సలాడ్ రెడీ...

English summary

Easy and Healthy Vegetable Salad for Summer | వెజిటేబుల్ సలాడ్: సమ్మర్ సలాడ్

Vegetarian Salads are limited only by the raw materials that are available, your taste preferences, and your imagination.
Story first published:Monday, March 5, 2012, 18:31 [IST]
Desktop Bottom Promotion