For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈజీ హోం మేడ్ బేల్ పూరి రిసిపి(వీడియో)

|

సాయంత్రంలో రకరకాల స్నాక్స్ తింటుంటారు. పానీ పూరి, బేల్ పూరి, దహీ వడ, ఇలాంటి అల్పాహారాలు బయట నిరాఢంబరంగా అమ్ముతుంటారు. భేల్ పూరి చాలా ప్రసిద్ది చెందినట్టువంటి చాట్..బేల్ పూరిని సాధారణంగా బొరుగులతో చేస్తుంటారు.

ఈ స్వీట్ అండ్ స్పైసీ అల్పాహారన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు కూడా అమితంగా ఇష్టపడుతారు. ఇంట్లో తయారుచేసుకొనే బేల్ పూరి శుభ్రతతో పాటు, ఆరోగ్యకరం కూడా. ఇండియన్ స్నాక్ బేల్ పూరి తయారుచేయడం చాలా సింపుల్. మీకోసం ఇక్కడ వీడియో ద్వారా బేల్ పూరిని తయారుచేసే విధానంను అంధిస్తున్నాము.

Easy Homemade Bhel Puri Recipe With Video

కావల్సిన పదార్థాలు:

మరమరాలు(బొరుగులు)-1కప్పు
సన్న మిక్చర్:-1 బౌల్(వేరుశెనగలు లేకుండా)
ఉల్లిపాయ: 1(ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
టమోటో ½ (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కొత్తిమీర తరుగు 2 కాడలు (సన్నగా తరిగినవి)
చిల్లీ టమోటా సాస్: 1tbsp
ఛాట్ మసాలా: 1tsp
బ్లాక్ ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక లంచ్ బాక్స్ (మూత గట్టిగా పట్టే బాక్స్)తీసుకోవాలి.
2. తర్వాత అందులో ఉల్లిపాయ, టమోటో ముక్కలు, కొ్దిగా కొత్తిమీర తరుగు, సేవ(సన్న మిక్చర్), బొరుగులు, ఛాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ వేయాలి.
3. తర్వాత అందులోనే కొద్దిగా చిల్లీ టమోటో సాస్ ను వేయాలి. వేసిన తర్వాత మూత పగట్టిగా పెట్టి, బాక్స్ ను చేతిలోకి తీసుకొని బాగా తిప్పాలి. షేక్ చేయాలి అంతే ఈజీ హోం మేడ్ బేల్ పూరి రిసిపి రెడీ.

<center><iframe width="100%" height="417" src="//www.youtube.com/embed/FWYZXYJp_Fk" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary

Easy Homemade Bhel Puri Recipe With Video

Bhel puri is a quintessential Indian snack. We all have had bhel puri at the street vendor stalls. However, we have become hygiene conscious now and sometimes, we are compelled to tell our children that the bhel puri recipe we try at home tastes better.
Story first published: Wednesday, April 30, 2014, 17:57 [IST]
Desktop Bottom Promotion