For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిబ్బన్ పకోడ : టేస్టీ అండ్ స్పైసీ స్నాక్

|

అక్టోబర్ నెల పండుగల సీజన్ మాత్రమే కాదు, మన భారతదేశం మొత్తం ఒక బ్యూటిఫుల్ వాతావరణం కలిగి ఉంటుంది. సంవత్సరం మొత్తంలో ఈ సీజన్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అయితే ఈ ఆహ్లాదకరమైన వాతారవణంలో సాయంత్రంలో అలా బయటకు వెళ్లి గరంగరం ఛాయ్ తో పాటు వేడి వేడిగా మంచింగ్ గా ఏదైనా తినాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అటువంటి మంచింగ్ స్నాక్స్ లో ఒకటి రిబ్బన్ పకోడా.

పది నిముషాల్లో ప్లేట్ నిండా రిబ్బన్ పకోడాలను తయారుచేయవచ్చు . వీటిని మనమే ఇంట్లో తయారుచేసుకోవచ్చు . ఈ రిబ్బన్ పకోడాలను ఇంట్లో తయారుచేయడం చాలా సులభం. సౌత్ ఇండియాలో వీటిని మురుకులు అంటారు. వీటని స్పైసీగా డీప్ ఫ్రై చేసుకుంటారు . మరి వీటిని ఇష్టంగా తినాలంటే, డైట్ ను పక్కన పెట్టాల్సిందే. మరికెందుకు ఆలస్యం, మొదలు పెట్టండి...

కావల్సిన పదార్థాలు:
బియ్యం పిండి: 1cup
శెనగపిండి: 3/4cup
కారం: 2tbsp
నెయ్యి: 2tbsp
బేకింగ్ సోడ: చిటికెడు
ఇంగువ: చిటికెడు
నీళ్ళు: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: డీప్ ఫ్రై చేయడానికి

తయారుచేయు విధానం:
1. ముందగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, శెనగపిండి, ఉప్పు, ఇంగువ, నెయ్యి మరియు కారం అన్నింటిని వేసి బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత సరిపడా నీళ్ళు పోసి పిండిని మెత్తగా సాఫ్ట్ గా కలుపుకోవాలి.
3. అంతలోపు, స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడి చేయాలి.
4. తర్వాత కలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని మురుకుల గొట్టల్లో పకోడా బ్లేడ్ ఫిట్ చేసి, తర్వాత అందులో పిండి పెట్టాలి.
5. ఇప్పుడు కాగే నూనెలో గుండ్రంగా పోకోడాలను ప్రెస్ చేయాలి. తర్వాత మంటను మీడియంగా పెట్టి పకోడాలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకోవాలి.
7. పకోడాలు చల్లబడిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి నిల్వ చేసుకోవచ్చు.

న్యూట్రిషియన్ వాల్యు:

శెనగపిండిని శెనగలతో తయారుచేస్తారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. మరియు ప్రోటీనలు కూడా అధికంగా ఉన్నాయి.
బియ్యం పిండిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Easy To Make Ribbon Pakoda

# చిట్కాలు

పకోడాలు రెడీ అయిన తర్వాత వాటిని తీసి ప్లేట్ లో వేసి, ఆ తర్వాత పేపర్ టిష్యు మీద వేయాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్ పూర్తిగా గ్రహించుకొంటుంది.

English summary

Easy To Make Ribbon Pakoda

Month of October is beautiful and the weather across India is at its best this time. So if you are looking out for some munchies that can be accompanied with your filter coffee or hot chai in the evening, then try out this Ribbon pakoda recipe.
Desktop Bottom Promotion