For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈజీ స్ట్రాబెర్రీ కేక్ రిసిపి: ఈజీ అండ్ సింపుల్

|

స్ట్రాబెర్రీ కేక్ రిసిపి: కేక్ అనేది ఆడంబర పూర్వక ఉత్సవాలు, ప్రత్యేకంగా వివాహాలు, వార్షికోత్సవాలు మరియు పుట్టినరోజుల్లో భోజనాల్లో వడ్డించే డెజర్ట్ పదార్ధంగా చెప్పవచ్చు. ప్రస్తుతం లెక్కలేనన్ని కేక్ వంటకాలు ఉన్నాయి; కొన్ని రొట్టె వంటి పదార్ధాలు, కొన్ని అద్భుతమైన రుచి మరియు అలంకరణలతో అందుబాటులో ఉన్నాయి మరియు పలు రకాలు దశాబ్దాల చరిత్రలను కలిగి ఉన్నాయి.

సాయంత్రం అయిందంటే చాలు.. స్నాక్స్ కోసం బేకరీ ఐటమ్స్, రోడ్ సైట్ పానీపూరీలు, సమోసాలు తినాలనుకుంటారు చాలామంది. . కానీ.. ఇంట్లోనే నోరూరించే స్నాక్స్ రెడీ చేసుకుని తింటే ఆ మజానే వేరు. కేక్ అంటే అందరికీ ప్రీతికరమే.. అందులోనూ.. చాకొలెట్ కేక్ అంటే.. వావ్ అని లొట్టలేయాల్సిందే.

మీ పిల్లలు ఎంతగానో ఇష్టపడే చాకొలెట్ కేక్ ని ఇంట్లోనే ఈజీగా తయారు చేయవచ్చు. మీకోసం ఒక సింపుల్ అండ్ ఈజీ స్ట్రాబెర్రీ కేక్ రిసిపిని పరిచయం చేస్తున్నాము. వింటుంటేనే నోరూరిపోతోంది కదూ.. ఇంకెందుకు ఆలస్యం.. చకచకా తయారు చేసి.. తినేయండి.

cake

కావల్సిన పదార్థాలు
స్ట్రాబెర్రీస్ - 10 ( slice it vertically )
గుడ్లు - 2 cup
పంచదార - 2 cup
మైదా - 1 cup
పెరుగు - 1/2 cup
బట్టర్ - 1 cup
కోకోపౌడర్ - 2 tablespoon
బేకింగ్ సోడ - 1/2 teaspoon
వెనీలా ఎసెన్స్ - 1 tablespoon
బేకింగ్ పౌడర్ - 2 tablespoon
ఉప్పు - 1/2 cup

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బట్టర్, పంచదార, వెనీలా ఎసెన్స్, బేకింగ్ సోడ, బేకింగ్ పౌడర్, మైదా, కోకోపౌడర్, మరియు గుడ్లు వేయాలి.
2. మొత్తం మిశ్రమాన్ని బాగా గిలకొట్టాలి.
3. ఇప్పుడు పెరుగు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
4. తర్వాత 9అంగులాలున్న పాన్ తీసుకొని అందులో బట్టర్ ను అప్లై చేయాలి.
5. ముందుగా కలిపిన పెట్టుకొన్న మిశ్రమాన్ని పాన్ లో వేసి పాన్ మొత్తం సర్ధాలి.
6. తర్వాత స్ట్రాబెర్రీ ఫ్రూట్ ముక్కలను ఈ మిశ్రమం మీద ప్లేస్ చేయాలి. .
7. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్లో నీళ్ళు పోసి అరకప్పు ఉప్పు వేయాలి. తర్వాత ఆ నీటి మీద కేక్ మిశ్రమం ఉంచిన పాన్ లేదా టిన్ ఉంచాలి.
8. ఈ మొత్తం మిశ్రమాన్ని కనీసం అరగంట పాటు మీడయం మంట మీద ఉడికించుకోవాలి. అంతే స్ట్రాబెర్రీ కేక్ రెడీ.

English summary

Easy Strawberry Cake Recipe

We all love a delicious piece of cake, don't we? However, of late cakes have become way too expensive. So, for a change, why don't you try a cake recipe at home? If you are ready for it, we shall share an awesome strawberry cake recipe with you today.
Story first published: Friday, December 11, 2015, 17:32 [IST]
Desktop Bottom Promotion