For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎగ్ లెస్ క్యారెట్ కేక్ రిసిపి: క్రిస్మస్ స్పెషల్

|

క్రిస్‌మస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది క్రిస్‌మస్ ట్రీ. పిల్లలకయితే క్రిస్‌మస్ తాత గుర్తుకువస్తాడు. ఇంకా ఏం గుర్తుకువస్తాయి అని అడిగితే...ప్రశ్న పూర్తవకుండానే జవాబు వచ్చేస్తుంది. నోరూరించే కేకులని. ఒకటి రెండూ కాదు ఆ సమయంలో బోలెడు రకాల కేకులు కెవ్వుమని కేక వేస్తాయి. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా చాకులతో రెడీ అయిపోతారు.

క్రిస్‌మస్‌ని కేకుతో ఆహ్వానిస్తారు. తియ్యగా సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ అంటే ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సమయం. క్రిస్మస్‌కి కేకులు తయారుచేసి వచ్చిన అతిథులకే కాక దూరాన ఉన్న వారికి సైతం ఆర్డర్ చేసి మరీ అందచేస్తారు. కొందరు మాత్రం ఇంట్లో చేసుకోవాలనుకుంటారు. అందుకే ఇక్కడ మీకోసం ఒక కేక్ రిసిపిని తయారుచేసే విధానంతో అంధిస్తున్నాం. మీరు కూడా ప్రయత్నించి మీ క్రియేటివిటీని జోడించి డెకొరేట్ చేయండి...కేక్ కట్ చేసి ఇంటికి వచ్చిన అతిథులకు క్రిస్మస్ శుభాకాంక్షలను తీయగా అందించండి...

Egg Less Carrot Cake Recipe: Chritmas Special

కావలసిన పదార్థాలు:
వెన్న: 1/2cup
కొబ్బరి తురుము: 1cup
అక్రోట్ ముక్కలు: 1cup
ఎండుద్రాక్ష: 1cup
క్యారెట్‌ తురుము: 3cups
దాల్చినచెక్కపొడి: 1tsp
జాజికాయ పొడి: 1tsp
అల్లంపొడి: 1tsp
బ్రౌన్‌ షుగర్‌ (ముడి పంచదార): 1cup
మైదాపిండి: 2cups
బేకింగ్‌సోడా: 1tsp
ఆరెంజ్‌ జ్యూస్‌: 2tsp

ఆరెంజ్ కేక్ విత్ చాక్లెట్ కేక్-క్రిస్మస్ స్పెషల్

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో మైదా, మసాలా పొడులు, బేకింగ్‌ సోడా, బ్రౌన్‌ షుగర్‌, వాల్‌నట్‌ ముక్కలు వేసి బాగా కలపాలి.
2. తర్వాత విడిగా ఓ పాన్‌లో వెన్న వేసి కరిగిన తరవాత బంగారువర్ణంలోని ఎండుద్రాక్ష, క్యారెట్లు, ఆరెంజ్‌ జ్యూస్‌ వేసి కలిపి వెంటనే దించి మైదా మిశ్రమంలో వేసి కలపాలి.
3. ఇప్పుడు మొత్తం మిశ్రమం కూడా వేసి బాగా కలపాలి.
4. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన బేకింగ్‌ టిన్‌లో వేసి సుమారు గంటసేపు 150 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర బేక్‌ చేయాలి.
5. చిన్న టూత్‌పిక్‌తో ఉడికిందో లేదో చూసి బయటకు తీయాలి. బయటకు తీసిన తరవాత ఐసింగ్‌ చేసి అందిస్తే బాగుంటుంది. మదర్స్ డే రోజున మీ మదర్స్ ను సర్ ప్రైజ్ చేయండి.

English summary

Egg Less Carrot Cake Recipe: Chritmas Special

Egg Less Carrot Cake Recipe: Chritmas Special, Dedicated to all the sweet tooth people out there. Carrot cake shouldn't be given a miss when in Singapore since it is one of the staples in Singapore's food culture.
Story first published: Tuesday, December 22, 2015, 18:20 [IST]
Desktop Bottom Promotion