For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సొరకాయ కోఫ్తా స్టె బై స్టెప్ రిసిపి

|

సొరకాయ, పుదీనా రెండూను ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సొరకాయ ఇండియాలో చాలా పాపులర్ వెజిటేబుల్. సొరకాయతో రుచికరమైన ఈవెనింగ్ స్నాక్స్ తయారు చేస్తారు. అయితే సొరకాయ కోఫ్తా చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఈవెనింగ్ టైమ్ లో మంచి రుచిని అందించడంతో పాటు కడుపు నిండేట్లు చేస్తుంది. ఇది తయారు చేయడం చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అందుకే స్టెప్ బై స్టెప్ అందిస్తున్నాం.

సొరకాయ కోఫ్తా బాల్స్ మంచి ఈవెనింగ్ స్నాక్. దీన్ని పుదీనా చట్నీతో తింటే మరింత రుచికరంగా ఉంటుంది. రుచి మాత్రమే కాదు పుదీనాలోని ఔషధగుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సొరకాయలో కూడా మంచి ఆరోగ్య గుణాలున్నాయి. విటమిన్ - సి, బి.కాంప్లెక్క్ష్, సొరకాయలో లబిస్తాయి. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది , సులువుగా జీర్ణమవుతుంది .డయూరెటిక్ గా పనిజేస్తుంది. ముత్రనాళాల జబ్బులకు ఇది మంచిది . పచ్చిసొరకాయ రసం దాహార్తిని అరికడుతుంది, అలసటను తగ్గిస్తుంది. మరి ఈ రెండింటి కాంబినేషన్ లో ఈ ఈవెనింగ్ స్నాక్ ఎలా ఉంటుందో రుచి చూడండి...

సొరకాయ తురుము: 500 gms(తురుముకోవాలి)
శెనగపిండి: 1cup
కారం: ½ tsp
గరం మసాలా: 1tsp
పచ్చిమిర్చి: 3 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కొత్తిమీర: 2కట్టలు (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
అజ్వైన్: ½ tsp
బేకింగ్ సోడా: 1చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2cups
పుదీనా చట్నీకి కావల్సిన పదార్థాలు:
పుదీనా ఆకులు: ఒక కప్పు
ఉల్లిపాయలు: 2(మీడియం సైజ్, నాలుగు బాగాలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 4
పచ్చిమిర్చి: 4
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:

సొరకాయకోఫ్తా-పుదీనా చట్నీ

పుదీనా: ఒక కప్పు పుదీనాను శుభ్రం చేసి మంచినీళ్ళతో కడి పక్కన పెట్టుకోవాలి.

సొరకాయకోఫ్తా-పుదీనా చట్నీ

ఉల్లిపాయలు: ఉల్లిపాయల పొట్టుతీసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి.

సొరకాయకోఫ్తా-పుదీనా చట్నీ

వెల్లుల్లి: తగినన్ని వెల్లుల్లి పాయలకు పొట్టితీసి పక్కన పెట్టుకోవాలి.

సొరకాయకోఫ్తా-పుదీనా చట్నీ

పచ్చిమిర్చి: తర్వాత పచ్చిమిర్చిను శుభ్రంగా కడిగి ఒక కప్పులు పక్కన పెట్టుకోవాలి.

సొరకాయకోఫ్తా-పుదీనా చట్నీ

గ్రైండింగ్ చట్నీ: ఇప్పుడు పుదీనా, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు కలుపుకోవచ్చు.

సొరకాయకోఫ్తా-పుదీనా చట్నీ

చట్నీ: మిక్సీ జార్ నుండి పుదీనా చట్నీ సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని, దానికి కొద్దిగా ఉప్పు, అవసరం అయితే కొద్దిగా చింతగుజ్జు మిక్స్ చేసుకోవాలి. అంతే పుదీనా చట్నీ రెడీ.

సొరకాయకోఫ్తా-పుదీనా చట్నీ

సొరకాయ తురుము: ఇప్పుడు సొరకాయను తరుముకొని, అందులోని నుండి నీటిని పిండేసి, ఒక కప్పులో ఇలా పొడిపొడి చేసి పెట్టుకోవాలి.

సొరకాయకోఫ్తా-పుదీనా చట్నీ

శెనగపిండి: ఇప్పడు సొరకాయకు శెనగపిండిని మిక్స్ చేయాలి.

సొరకాయకోఫ్తా-పుదీనా చట్నీ

సొరకాయ మిశ్రమం: సొరకాయ తరుము, శెనగపిండి మిశ్రమానికి కొద్దిగా కారం, గరం మసాలా, పచ్చిమిర్చి, బేకింగ్ సోడా, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

సొరకాయకోఫ్తా-పుదీనా చట్నీ

కోఫ్తా బాల్స్: ఈ మిశ్రమానికి కొద్దిగా నీరు చేర్చి ముద్దలా కలుపుకొని కోప్తాబాల్స్ లా ఉండలు చుట్టుకోవాలి. (నీరు తగినంత మాత్రమే పోసుకోవాలి. లేదంటే నీరు కారి సొరకాయ తరుము విడి పోతుంది.

సొరకాయకోఫ్తా-పుదీనా చట్నీ

ఫ్రైయింగ్: ఇప్పుడు కడాయిలో నూనె వేసి కాగిన తర్వాత, అందులో కోప్తా బాల్స్ ను వేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. గోఫ్తా బాల్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూవేయిస్తూ పది నిముషాల తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని పట్టుకోవాలి.

సొరకాయకోఫ్తా-పుదీనా చట్నీ

కోప్తా మరియు పుదీన చట్నీ: అంతే సొరకాయ కోప్తా మరియు పుదీనా చట్నీ రెడీ. వేడి వేడి సొరకాయ కోఫ్తాను పుదీనా చట్నీతో సర్వే చేయాలి అంతే.

English summary

Ghiya Kofta Recipe: Step By Step | సొరకాయకోఫ్తా-పుదీనా చట్నీ

Koftas made of ghiya or bottle gourd are very popular in India. Ghiya koftas are sometimes also referred to as lauki koftas. You may already know many kofta recipes. But the real challenge is to learn a recipe step by step. Every step of the recipe is equally important. A step by step kofta recipe also gives you the visual guidance that is otherwise absent in other recipes.
Story first published: Saturday, March 23, 2013, 16:31 [IST]
Desktop Bottom Promotion