For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కారం గప్ చుప్ తయారీ ఎలా?

By Super
|

Karam Gupchup
కావల్సిన పదార్థాలు:
మైదాపిండి - 2 గ్లాసులు
వెన్న - 50 గ్రా.
జీలకర్ర - 1 చెంచా
కారం - 2 చెంచాలు
ఉప్పు- సరిపడేంత
నూనె - వేయించడానికి సరిపడేంత

తయారీ విధానం:
మైదాపిండి బాగా జల్లించుకొని ఒక బేసిన్లో వేసుకోవాలి. దాన్లో వెన్న, జీలకర్ర, కారం, సరిపడేంత ఉప్పు వేసి నీటితో కలపాలి. పూరికి, చపాతికి ఎలా అయితే పిండిని నీళ్లు పోసుకుంటూ కలుపుతామో ఆలాగే కలపాలి. గట్టిగా ఉండేలా చూసుకోవాలి. పిండిని ఉండల్లా చేసి, కొంచెం మందంగా పూరీలా వత్తుకొని చాకుతో డైమండ్ ఆకారంలో కోసుకొని, నూనె పొయ్యిమీద పెట్టి బాగా కాగిన తర్వాత ఈ కోసుకున్న ముక్కలు వేసి దోరగా వేయించాలి. కారం గప్ చుప్ లు తినడానికి రెడీ.

Desktop Bottom Promotion