For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇఫ్తార్ స్వీట్స్: షహీ షీర్ కుర్మా రిసిపి

|

రంజాన్ ముస్లింలకు పవిత్రమైన నెల. అత్యంత కఠోర నియమాలతో ఈ నెలలో ఉపవాసాలు చేస్తారు.. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ మంచి నీరైనా ముట్టరు. వీరు సూర్యోదయానికి ముందు..సూర్యాస్తమయం తర్వాత బలమైన ఆహారం తీసుకుంటారు.

READ MORE: రుచికరమైన ఆలూ ఖీర్ రిసిపి: స్వీట్ డిష్

బలమైన ఆహారంతో పాటు, వారికి ఇష్టమైన వంటలను ఈ నెలలో ఎక్కువగా తయారు చేసుకొని, వారి ఉపవాస దీక్షను తీర్చుకొంటారు. అందుకు శాకాహారం, మాంసాహారమే కాకుండా, కొన్ని రకాల తీపి రుచులను కూడా ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. అందులో ఒకటి ఈ షీర్ కుర్మా. ఇది పాపులర్ మొఘలాయ్ డిజర్ట్. దీన్ని సేమియా మరియు కొన్ని రకాల ఎండు ఫలాలతో తయారు చేస్తారు. ఈ డ్రై ఫ్రూట్స్, యాలకులతో ఈ స్పెషట్ స్వీట్ ఘుమఘుమలాడుతూ నోరూరిస్తుంటి. మరి ఈ మొఘలాయ్ స్పెషల్ ట్రీట్ ను ఈ రంజాన్ వేళ ఎలా తయారు చేయాలో ఒక సారి చూడండి...

Iftaar Sweets: Shahi Sheer Khurma Recipe: Telugu Vantalu

కావల్సిన పదార్థాలు:
వర్మిసెల్లీ : 1/2 cup
పాలు: 1 లీటర్
నెయ్యి: 1 tbsp
డ్రై డేట్స్(ఎండు ఖర్జూరం): 10 sliced
యాలకలు: 4 cloves
పిస్తాచో: 4 tbsp
బాదం: 4 tbsp
రోస్ట్ చేసిన జీడిపప్పు: 10 (గార్నిష్ చేయడానికి)
కుంకుమపువ్వు: 1 tsp
పంచదార: 1/2 cup
కోవ: 4 tbsp
రోజ్ వాటర్: one tbsp
మిల్క్ మెయిడ్ : 3 tbsp

Iftaar Sweets: Shahi Sheer Khurma Recipe: Telugu Vantalu

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి అందులో యాలకలు, సన్నని సేమియా, బాదం, పిస్తా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత ఒక గిన్నెలో పాలు, కోవ, మిల్క్ మెయిడ్, పంచదార, మరియు ఖర్జూరం వేసి బాగా మరిగించాలి.

READ MORE: రంజాన్ స్వీట్: ఈజీ పన్నీర్ గులాబ్ జామూన్

3. పాలు బాగా కాగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్ మరియు సేమియా రెండూ వేసి మిక్స్ చేసుకోవాలి .
4. మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని పాలు చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.
5. చివరగా కుంకుమపువ్వును చిలకరించి గిన్నెమొత్తం స్ప్రెడ్ చేయాలి.
6. చివరగా కొబ్బరి తురుము మరియు నువ్వులను గార్నిష్ గా అలంకరించాలి. అంతే షహీ షీర్ కుర్మా రెడీ.

English summary

Iftaar Sweets: Shahi Sheer Khurma Recipe: Telugu Vantalu

Iftaar Sweets: Shahi Sheer Khurma Recipe: Telugu Vantalu, Shahi Sheer Khurma is a special dish of Ramzan and Eid. In urdu it means milk with dates. Sheer kurma is a vermicelli pudding which is a traditional sweet dish of Muslims in India, Pakistan and Bangladesh.
Story first published: Wednesday, July 15, 2015, 16:49 [IST]
Desktop Bottom Promotion