Just In
- 10 min ago Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- 1 hr ago మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- 2 hrs ago సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- 5 hrs ago అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
బొజ్జగణపయ్యకు ఇష్టమైన జిల్లేడుకాయలు
వినాయక చవితి సందడి మొదలైంది.. చవితి దేవునికి చవులూరే వంటకాలతో స్వాగతం పలికే సందర్భం ఇది. భక్తుల పెట్టే ప్రసాదం భుజించి, వరప్రసాదాలు అందించే వినాయకుడికి నైవేద్యాల విందుతో నిండుదనం చేకూర్చుదాం. గణనాథునికి ప్రీతి పాత్రమైన రుచులు తయారుచేసి నైవేద్యం పెడితే మీరు కోరిన కోరికలు ఇట్టే తీరుతాయి.
'గణేష్ భగవాన్' తమలో శక్తిని, స్థైర్యాన్ని పెంచి కోరిన కోర్కెలు తీర్చుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి మీ ఆరాధ్యధైవమైన 'బొజ్జగణపయ్య'ను చవితిరోజున ఏలా కొలుద్దామనుకుంటున్నారు. ఏలాంటి ఫలహారం స్వామికి నైవేద్యంగా పెడదామనుకుంటున్నారు. 'ఉత్తర భారతదేశం'లో గణనాథుని పండుగను అతి పవిత్రంగా జరుపుకుంటారు. వీరి పూజలో 'మోదక్' వంటంకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
గణనాథునికి ఇష్టమైన 'జిల్లేడు కాయలను' నైవేద్యంగా పెడితే తాము కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఈ వంటను ఎలా తయారు చేయాలో చూద్దాం..
కావలసిన
పదార్థాలు:
బియ్యప్పిండి:
2cups
నీరు:
5cups
కొబ్బరితురుము:
1cup
బెల్లం
తురుము:
1cup
ఏలకులపొడి:
1tsp
తయారుచేయు
విధానం:
1.
ముందుగా
ఒక
పాత్రలో
నీరు
పోసి
మరిగించాలి.
2.
తర్వాత
బియ్యప్పిండి
వేసి
బాగా
కలిపి
మంట
తగ్గించి,
పదినిముషాలుంచి
దించేయాలి.
3.
ఇప్పుడు
పాన్
లో
కొబ్బరితురుము,
బెల్లం
తురుము,
ఏలకుల
పొడి
వేసి
స్టౌమీద
ఉంచి,
ఉడికించి
దించేయాలి.
4.
చల్లారాక
చిన్నచిన్న
ఉండలు
చేసి
పక్కన
ఉంచాలి.
5.
తర్వాత
కొద్దిగా
బియ్యప్పిండిని
చేతిలోకి
తీసుకుని,
పల్చగా
ఒత్తి
కొబ్బరి
ఉండను
అందులో
ఉంచి
జిల్లేడుకాయ
ఆకారంలో
అంచులను
మూసేయాలి.
6.
ఇలా
అన్నీ
తయారుచేకుని,
ఇడ్లీ
రేకులలో
ఉంచి,
కుకర్లో
పెట్టి,
మూత
ఉంచాలి.
పదినిముషాలయ్యాక
దించేయాలి.
(విజిల్
పెట్టకూడదు)