For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సొరకాయ హల్వ: టేస్టీ అండ్ యమ్నీ డిష్

|

సొరకాయ హల్వ చాలా పాపులర్ అయినటువంటి ట్రెడిషనల్ డిజర్ట్, దీన్ని మన ఇండియాలో అన్ని ప్రదేశాల్లో తయారుచేస్తారు . ముఖ్యంగా ఆ సొరకాయను ఉపవాసాలున్న సమయంలో చాలా మంది ఇల్లల్లో దీంతో తయారుచేసిన ఆహారాలను అల్పాహారంగా తీసుకుంటారు. సొరకాయను వివిధ రకాల వంటలను తయారుచేసుకోవచ్చు. అయితే సొరకాయతో తయారుచేసి స్వీట్ డిష్ మాత్రం అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది.

ఈ సొరకాయ హల్వను పాలు, నెయ్యి, పంచదార, కొన్ని డ్రై నట్స్ ఉపయోగించి తయారుచేస్తారు. మరి ఈ రుచికరమైన డిజర్ట్స్ ను మీరుకూడా రుచి చూడాలంటే తప్పనిసరిగా ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం....

Lauki Ka Halwa Recipe

కావల్సిన పదార్థాలు
సొరకాయ ముక్కలు: 3cups
నెయ్యి: 3tbsp
వేడి పాలు: 3cups
యాలకలపొడి: 1/2tsp
పంచదార: 3/4cup(పొడి చేసుకోవాలి)
బాదం: 8-10

తయారుచేయు విధానం:
1.ముందుగా సొరకాయను పొట్టు తీసి, తురుము కోవాలి.
2. తర్వాత డీప్ బాటమ్ పాన్ ను స్టౌ మీద పెట్టి, నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో సొరకాయ తురుము వేసి ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి.
3. సొరకాయ తురుము ఉడుకుతున్న సమయంలో అందులో నీరు రావడం మొదలవుతుంది. ఈ నీరు మొత్తం ఇమిరిపోయే వరకూ కలియబెడుతూ ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లో వేడి పాలు పేసి మిక్స్ చేయాలి . మంటను మీడియంగా పెట్టి 10 నిముషాలు ఉడికించుకోవాలి.
5. ఇప్పుడు అందులో యాలకల పొడి వేసి మిక్స్ చేయాలి. సొరకాయ హల్వా తయారయ్యే సమయంలో అందులో పంచదార వేయాలి.
6. మొత్తం మిశ్రమాన్నికలియబెడుతూ మరో 5నిముషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.
7. చివరగా బాదం పలుకులను అందులో వేసి చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి. అంతే సొరకాయ హల్వా రెడీ...

English summary

Lauki Ka Halwa Recipe

Bottle gourd halva is made with bottle gourd, sugar, nuts and reduced whole milk. Bottle gourd halva make a really yummy warm dessert. It is usually enjoyed in winter season since warm desserts are preferred in winter.
Story first published: Monday, April 20, 2015, 16:58 [IST]
Desktop Bottom Promotion