For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెసరపప్పు-బెల్లంతో కొబ్బరి బూరెలు

|

Moong Dal Burelu
కావలసిన పదార్ధాలు:
వేయించిన పెసరప్పు: 1/2kg
ఎండుకొబ్బరి: 1/4kg
అటుకుల పొడి: 1/4kg
యాలకల పొడి: 1tsp
బెల్లం: 1/2 kg
నెయ్యి: తగినంత
నూనె: తగినంత

తయారు చేయు విధానము:
1. ముందుగా పెసర పప్పును లైట్ గా వేయించి మిక్సీలో వేసి రవ్వలా తయారు చేసుకోవాలి.
2. ఆ తరువాత బెల్లానికి సరిపడా నీళ్లు పోసి యాలకుల పొడి వేసి తీగపాకం వచ్చేవరకూ ఉడికించాలి. తరువాత అందులో నెయ్యి, అటుకుల పొడి, కొబ్బరి పొడి, పెసర రవ్వను పోసి గట్టిగా వచ్చే వరకూ కలపాలి.
3. ఇలా తయారు చేసిన దానిని చిన్నచిన్న ముద్దలుగా చేసి గుండ్రంగా వత్తుకోవాలి. వీటిని మరుగుతున్న నూనెలో వేసి దోరగా వేయించి తీసి సర్వ్ చేయాలి అంతే కొబ్బరి బూరెలు రెడీ.

Story first published:Tuesday, April 27, 2010, 14:30 [IST]
Desktop Bottom Promotion