For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూంగ్ దాల్ పూరి

|

Moong Dal Puri
కావలసిన పదార్ధాలు:

మూంగ్ దాల్ : 1 cup( నాన బెట్టినవి)
గోధుమ పిండి : 3 cup
జిలకర్ర : 1/2 tsp
కారం : 1 tsp
పచ్చిమిర్చి పేస్ట్ : 1/2 tsp
గరం మసాలా : 1/2 tsp
ధనియాల పొడి : 1/2 tsp
పసుపు : 1/2 tsp
ఉప్పు : రుచికి సరిపడా
నూనె : వేయించడానికి తగినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో లో నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత అందులో నానబెట్టుకున్న మూంగ్ దాల్ వేయాలి. అందులోనే పసుపు, జిలకర్ర, కారం, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కాసేపు వేగ నివ్వాలి.
2. వేగిన తర్వాత అందులో కొద్దిగా నీరు పోసి ఉడక నివ్వాలి. ఈ మిశ్రమం ఉడికేంత లోపు, వేడల్పాటి గిన్నెలో గోధుమ పిండిని, నీరు పోసి చపాతిపిండిలా కలుపుకోవాలి.
3. తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, బిళ్ళు మాదిరిగా నోక్కి మధ్యలో ఒక్కో స్పూన్ చొప్పున మూంగ్ దాల్ మిశ్రమాన్ని ఉంచి, పూరీలు మాదిరిగా నొక్కి మధ్యలో ఒక్కో స్పూన్ చొప్పున మూంగ్ దాల్ మిశ్రమాన్ని ఉంచి, పూరీలు మాదిరిగా చేసుకొని నూనెలో వేయించాలి. వేడి వేడి మూంగ్ దాల్ పూరి రెడీ.

Story first published:Friday, November 20, 2009, 17:02 [IST]
Desktop Bottom Promotion