For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మష్రుమ్ ఆమ్లెట్: హెల్తీ ఈవెనింగ్ స్నాక్ రిసిపి

|

ఆమ్లెట్ అనేది ఒక టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్, మీల్ సైడ్ డిష్ మరియు హెల్తీ ఈవెనింగ్ స్నాక్ రిసిపి కూడా. ఆమ్లెట్ ను ఏ సమయంలో అయినా తినవచ్చు. కొన్ని రకాల ఆమ్లెట్స్ ను చాలా టేస్టీగా మరియు సులభంగా తయారుచేసుకోవచ్చు.

ఆమ్లెట్ ను వివిధ రకాలుగా తయారుచేసుకోవచ్చు. ప్లెయిన్ ఆమ్లెట్ కు కొద్దిగా ఉప్పు మరియు పెప్పర్ పౌడర్ చల్లనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆమ్లెట్ కు కొన్ని వెజిటేబుల్ ముక్కలు మరియు చీజ్ జోడించుకోవచ్చు. మీరు ఎప్పుడైనా మష్రుమ్ తో ఆమ్లెట్ ప్రయత్నించారా? లేదంటే ఈ వీకెండ్ లో ఈ స్ఫెషల్ మష్రుమ్ ఎగ్ ఆమ్లెట్ రిసిపిని ట్రై చేయండి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం..

Mushroom Omelette Recipe: Healthy Evening Snack Recipe

కావల్సిన పదార్థాలు
కావలసిన పదార్థాలు:
మష్రూమ్స్‌ - 100 గ్రా.,
గుడ్లు - 3,
మిరియాల పొడి - అర టీ స్పూను,
ఛాట్ మసాలా- పావు టీ స్పూను,
బట్టర్: 1tsp
చీజ్: 1tsp
ఉల్లిపాయలు - 2,
పచ్చిమిర్చి - 2,
కొత్తిమీర - 1 కట్ట,
ఉప్పు - రుచికి తగినంత,
నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని గుడ్డు పగులగొట్టి బౌల్లోనికి జాగ్రత్తగా వంచుకోవాలి.
2. ఇప్పుడు ఎగ్ కు ఉప్పు, సన్నగా తరిగిపెట్టుకొన్న మష్రుమ్, కొత్తిమీ, అన్ని వేసి బాగా గిలకొట్టాలి.
3. అలాగే అందులో పెప్పర్ అప్పుడే వేయవచ్చు లేదా తర్వాత కూడా పెప్పర్ ను చిలకరించుకోవచ్చు.
4. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి.
6. ఇప్పుడు మష్రుమ్ ఎగ్ మిక్స్ చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని పాన్ మీద పోయాలి.
7. ఈ ఆమ్లెట్ ను రెండు వైపులా కొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
8. ఇప్పుడు దానికి పెప్పర్ పౌడర్, చాట్ మసాలా చిలకరించాలి. మీరు ఇంకా దానీ మీద చీజ్, బట్టర్ తురుమును కూడా చిలకరించాలి.
9. చివరగా కొత్తిమీర తరుగు గార్నిష్ చేయాలి. అంతే ఎగ్ విత్ మష్రుమ్ మీల్ ఆమ్లెట్ రెడీ. ఇది హెల్తీ ఈవెనింగ్ స్నాక్ రిసిపి.

English summary

Mushroom Omelette Recipe: Healthy Evening Snack Recipe

Mushroom Omelette Recipe: Healthy Evening Snack Recipe. Omelette is one of the most popular breakfast recipes. Whenever we think of breakfast, egg recipes come to rescue. Boiled or poached eggs, omelette are few common egg recipes that are easy to prepare and are delicious too.
Story first published: Friday, September 18, 2015, 16:27 [IST]
Desktop Bottom Promotion