For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మష్రూమ్- పన్నీర్ టిక్కా

|

Mushroom Paneer Tikka
కావలసిన పదార్ధాలు:

మష్రూమ్- 4
పన్నీర్ తురుము -1 cup
పెరుగు - 1 cup
జిలకర్ర - 1tsp
అల్లం- 10grm
ఉల్లిపాయలు -2
పచ్చిమిరప - 4
కరివేపాకు - 2 రెమ్మలు
క్యాప్సికమ్ - 1 cup
బటానీ - 1 cup
పసుపు - చిటికెడు
కారం - 1tsp
దనియా- 1tsp
ఉప్పు - రుచికి సరిపడా
కాజు పౌడర్ - 2 tsp
టమోటో పేస్ట్ - 1 cup
పొదీనా - 2 కొమ్మలు
గరం మసాలా- 1tsp

తయారు చేయు విధానం:

మొదట ఒక గిన్నెలో నీరు పోసి స్టౌ మీద పెట్టి అందులో మష్రూమ్ ముక్కలను వేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి అందులో కట్ చేసి పెట్టుకొన్న పన్నీరు ముక్కలు వేసి దోరగా వేపి పక్కన పెట్టుకోవాలి. అయిల్ ఉన్న పాన్ లోనే ఉడికించిన మష్రూమ్ ని వేసి వేపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత జిలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేపాలి. తర్వాత క్యాప్సికమ్, బటానీ, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ , పన్నీరు ముక్కలు వేసి అన్నింటిని బాగా ప్రైచేయాలి. వేగాక కొద్దిగా కారం, దనియా పొడి, ఉప్పు, కాజు పొడి, పొదినా, టమోటో పేస్ట్ వేసి ప్రై చేసి మూత పెట్టి 10 నిమిషాల తర్వాత గరం మసాలా చేర్చి దింపుకొని కొత్తిమిర తురుము చల్లి చపాతి, పూరీ తో వడ్డించండి.

Story first published:Tuesday, October 13, 2009, 18:12 [IST]
Desktop Bottom Promotion