For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలక్ పనీర్ ఇడ్లీ

|

Palak Paneer Idli
పాలకూర, పనీర్ రెండూ అందరికీ ఇష్టమైనవే. ఈ రెండు కాంబినేషన్స్ లో ఎన్నో వంటకాలు తయారు చేసుకొంటారు. పాలక్ పనీర్ దోసె, పాలక్ పనీర్ పకోడి ఇలా...పాలకూర, పనీర్ రెండూ ఆరోగ్యానికి మంచివే. ఆకుకూరల్లో ప్రధానంగా పాలకూర. పాలకూరలో ఉన్న పోషకాలు మరి ఎందులోను అంత ఎక్కువగా ఉండవు. మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. పనీర్ అంటేనే పిల్లలు చాలా ఇష్టపడతారు.

కావలసిన పదార్థాలు
పాలకూర: 1cup
పనీర్: 1/2cup
మినపప్పు: 1cup
బియ్యం: 1cup
పచ్చిమిర్చి: 4-6
టమోట: 1
ఉప్పు: రుచికి తగినంత
జీడిపప్పు: పనీర్: 1/2cup

తయారు చేయు విధానం:
1. ముందుగా మినపప్పు, బియ్యం విడివిడిగా కడిగి నానబెట్టుకోవాలి. పప్పు, బియ్యాన్ని ఎక్కువసేపు నానబెడితే ఇడ్లీ మొత్తగా వస్తుంది.
2. బియ్యం, పప్పు బాగా నాని తర్వాత రుబ్బుకొని ఉప్పు కలిపి పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ మిశ్రమంలో చిటికెడు బేకింగ్ సోడ, టమోట ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగి వేసుకోవాలి.
3. ఇందులోనే పాలకూర, పనీర్ ని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర లోపల నూనె రాసి ఇడ్లీ ప్లేట్ లో ఇడ్లీల పిండి నింపి దాని పై జీడిపప్పులను సర్ది, ఇడ్లీ కుక్కర్ పెట్టి, ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంతే పాలక్ పనీర్ ఇడ్లీ రెడీ. పాలక్ పనీర్ ఇడ్లీకి పుదీనా చట్నీ మంచి కాంబినేషన్ ఇలా చేయడం వల్ల వెరైటీ ఇడ్లీగా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం....

English summary

Palak Paneer Idli | పాలక్ పనీర్ ఇడ్లీ

Palak Paneer Idli. Same Idli recipe with green goodness of spinach. Bright green colored idlis look attractive too. idli is a popular dish of south India. It is easy to prepare at short notice and most of the children like it. Idli has always been lauded as a healthy breakfast option, since it is a steamed food made of protein-rich and energy giving ingredients like urad dal and rice.
Story first published:Saturday, April 7, 2012, 12:58 [IST]
Desktop Bottom Promotion