For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అటుకులు-కొబ్బరి పాయసం కృష్ణాష్టమి స్పెషల్

అటుకులు-కొబ్బరి పాయసం కృష్ణాష్టమి స్పెషల్

|

Poha-Coconut Payasam
ఈ రోజు శ్రీ కృష్ణాష్టామిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. చిన్ని కృష్ణున్ని తమ ఇళ్లకు ఆహ్వానిస్తూ పడతులు కృష్ణ పాదాలు వేస్తారు. బాలకృష్ణుడు తమ ఇంట అడుగుపెడితే సకలశుభాలు కలుగుతాయని భావిస్తారు. ఉదయమంతా పూజాది కార్యక్రమాల్లో సాయంత్రం ఉట్టి కొడతారు. ఈ వేడుకల్లో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొంటారు. యువకులు ఉట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా, యువతులు దాన్ని వారికి అందకుండా పైకి లాగుతారు. ఉట్టి కొట్టిన తర్వాత ప్రసాదాలు పంచుతారు.

ఆ ప్రసాదాలలో తప్పనిసరిగా అటుకులతో చేసి వెరైటీలే కనబడుతాయి. అటుకులంటే అంత ఇష్టం కృష్ణునికి. కుచేలుడి సంగతి కృష్ణునికి తెలియదా...?కాని - అటుకులు పట్టుకొస్తే తప్ప కరుణించలేదు..! గోప వనితలు ఎంత ఆరాధిస్తే ఏం?పాల కడవలో, వెన్న కుండలో సమర్పించాల్సిందే కదా!తల్లి యశోద కొసరి కొసరి ఎన్ని తినిపించిందో కాని, ఆ నల్లగోపయ్య భక్తుల చిట్టి ప్రసాదం చూస్తే మురిసిపోతాడు. తన సాక్షాత్కారంతో మెరిసిపోతాడు. ఈ కృష్ణుడి పుట్టినరోజున..చిట్టి పాదాలతో నడిచి వచ్చే ఆ స్వామికి ఇష్టమైన అటుకులతో పాయసం చేసి ఈ తీపి వంటకం సమర్పిద్దాం...

కావలసిన పదార్థాలు:
అటుకులు: 2cups
పచ్చికొబ్బరి చిప్ప: 1
యాలకుల పొడి: 1tsp
పంచదార: 3cups
పాలు: 1ltr
జీడిపప్పు: 15-20
కిస్ మిస్: 15-20
నెయ్యి: 4tsp
కస్టర్డ్ పౌడర్: 2tsp
నెయ్యి: నాలుగు టీస్పూన్లు

తయారు చేయు విధానం:
1. మంద పాటి గిన్నెలో పాలు పోసి స్టౌ మీద పెట్టి సన్నమంట మీద ఎర్రగా కాగనివ్వాలి.
2. తర్వాత అందులో పంచదార వేసి మరికొద్ది సేపు కాగనివ్వాలి.
3. తర్వాత కస్టర్డ్ పౌడర్ ఒక కప్పులో వేసి,కాచి చల్లార్చిన పాలు పోసి తిప్పుతూ ఉండకట్టకుండా కలిపి ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలల్లో వేసి రెండు నిమిషాలు తిప్పి దించిన తరవ్ాత అటుకులు వేయాలి.
4. ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసి ముందుగా జీడిపప్పు, తర్వాత కిస్ మిస్ వేసి వేయించుకొని పాయసంలో వెయ్యాలి.
5. చివరగా కొబ్బరికోరు, యాలకులు పొడి వేసి బాగా కలపాలి. అటుకుల పాయసం రెడీ.

English summary

Poha-Coconut Payasam for Krishnashtami Special | అటుకుల పాయసం కృష్ణాష్టమి స్పెషల్

On the occasion of Janmashtami, people relish on umpteen varieties of dishes. Explore recipes of some popular dishes prepared on the festival.
Desktop Bottom Promotion