For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొటాటో పనీర్ చిల్లీ పకోడా: వింటర్ స్పెషల్

|

వింటర్ లో సాయంత్ర సమయాల్లో టీ, కాఫీలతో పాటు ఏదైనా సాడ్ విచ్ తినాలనిపిస్తుంటుంది. అయితే ఈ పొటాటో పన్నీర్ పకోడ మంచి రుచితోపాటు, ఆరోగ్యానికి ఉపయోగపడే న్యూట్రిషియన్స్ ను అందిస్తుంది. ఇది పిల్లలు పెద్దలు అమితంగా ఇష్టపడి తింటారు. పనీర్ తో తయారుచేసే వంటలు చాల రుచికరంగా ఉంటాయి . చలిగా ఉన్న రోజుల్లో ఇలాంటి స్పైసీ స్నాక్ తయారుచేసుకొని తనడం భలే మజాగా ఉంటుంది.

పనీర్ తో వివిధ రకాల వంటలు చేసినప్పటికీ, స్నాక్ రసిపి చాలా వెరైటీగా ఉంటుంది. ఈ పనీర్ రిసిపి చాలా సింపుల్ గా , త్వరగా తయారుచేసుకోవచ్చు . పనీర్ లో అనేక హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ ను దూరం చేస్తుంది. మరి ఈ హెల్తీ, అండ్ టేస్టీ పొటాటో పనీర్ స్నాక్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Potato paneer chili pakora

కావలసిన పదార్థాలు:
పొటాటో: 4(ఉడికించి పొట్టుతీసి మెత్తగా చేసుకోవాలి)
పచ్చిమిర్చి - 250grm
పనీర్ తురుము - 1/2cup
సెనగ పిండి - 150grm
బియ్యప్పిండి - 1tbps
కారం - 1tps
ఉప్పు - రుచికి తగినంత
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
ధనియాల పొడి - 1tbps
బేకింగ్ సోడా - చిటికెడు

తయారు చేయు విధానం:
1. పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తొడిమలు తీసేయాలి మిక్సీలో పచ్చి మిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. ఒక పాత్రలో పచ్చిమిర్చి ముద్ద, పనీర్ తురుము, పొటాటో వేసి బాగా కలపాలి.
3. సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, బేకింగ్ పౌడర్ జత చేసి మరోమారు కలపాలి.
4. (అవసరమనుకుంటేనే నీరు జతచేయాలి) బాణలిలో నూనె కాగాక, ఈ మిశ్రమాన్ని పకోడీలుగా వేయించాలి బంగారు వర్ణంలోకి వచ్చాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి చిల్లీ సాస్‌తో వేడివేడి పకోడీలను అందిస్తే రుచిగా ఉంటాయి.

English summary

Potato Paneer Chili Pakora: Winter Special

Recipes with paneer are very tasty. On this winter evening, today we shall tell you how to prepare paneer bajji. It is the best recipe that you can try on a chilly day. Though there are many recipes that can be prepared with paneer, this one's the best that one can try and taste.
Story first published: Saturday, December 12, 2015, 16:56 [IST]
Desktop Bottom Promotion