For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ టిక్కీ - చోలే చాట్

|

Potato Tikki-Choley Chaat
కావలసిన పదార్థాలు:
రెడ్ పొటాటో: 6-8 (ఉడికించి పొట్టు తీసి చిదిమి పెట్టుకోవాలి)
పచ్చి బఠానీలు: 1/2cup
అల్లం తురుము: 1tbsp
వెల్లుల్లి ముక్కలు: 1tbsp
పచ్చిమిర్చి: 4-6(చిన్న ముక్కులుగా కట్ చేసుకోవాలి
కొత్తిమీర తరుగు: 2tbsp
కారం: 1tsp
ధనియాపొడి: 1tsp
గరం మసాలా: 1tsp
జీలకర్ర: 1tsp
నిమ్మరసం: 1/2tsp
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి తగినంత
రవ్వ: 1/2cup
నూనె: సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె కొద్దిగా వేసి కాగిన తర్వాత అందులో జీలకర్ర వేసి చిటపటలాడాక, అందులో వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం రెండు నిమిషాలు వేగనివ్వాలి.
2. ఇప్పుడు పొడులన్ని వేసి బాగే వేగించాలి. పొడులు వేగిన తర్వాత వెంటనే ఉడికించిన పచ్చిబఠానీ, రెండు నిమిషాల తర్వాత ఉడికించి పొట్టు తీసి పెట్టుకొన్న రెడ్ పొటాటో వేసి బాగా మిక్స్ చేసి ఐదు నిమిషాల పాటు వేయించాలి.
3. ఇప్పుడు అందులో ఉప్పు, నిమ్మరసం కలిపి మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర తరుగు వేసి మరోసారి బాగా కలియబెట్టి పక్కకు తీసి చల్లారనివ్వాలి.
4. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వడ లాగా తట్టి, రవ్వలో రెండువైపులా అద్ది, వేడి నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకూ వేగనివ్వాలి.

ఇప్పుడు చోలే తయారు చేయు విధానం చూద్దాం
కావలసిన పదార్థాలు:
కాబూలీ శెనగలు: 2cups
ఉల్లిపాయ: 1(చిన్నముక్కలుగా కట్ చేసినవి)
టమోటో: 1(చిన్నముక్కలుగా కట్ చేసినవి)
కొత్తిమీర తరుగు: 2tbsp
కారం: 1tsp
పసుపు: 1/4tsp
ఆమ్ చ్యూర్ పొడి(మామిడికాయను ఎండబెట్టి పొడిచేసినది): 1tsp
చోలే పౌడర్: 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా సాస్ పాన్ లో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. 2. ఇప్పుడు అందులో కొత్తిమీర తరుగు, కారం, పసుపు, ఆమ్ చ్యూర్ పౌడర్, చోలే వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
3. తర్వాత అందులోనే టమోటో ముక్కలు వేసి తక్కువ మంట మీద బాగా వేయించుకోవాలి. నూనె పైకి తేలే సమయం చూసి అందులో ఉడికించిన చోలే, కొద్దిగా నీళ్లు వేసి బాగా ఉడకనివ్వాలి. అందులోనే ఉప్పు వేసి గ్రేవీ చిక్కబడే వరకూ వేయించుకోవాలి.

చాట్ తయారీ
కావలసిన పదార్థాలు:
పెరుగు: 1/2cup
చింతగుజ్జు: 1/2cup
ఉల్లిపాయ ముక్కలు: 1/2cup
కొద్దిగా కొత్తిమీర తరుగు
ఆలూ టిక్కీ - చోలే చాట్ తయారీ:
ఇప్పుడు సర్వింగ్ ప్లేట్, ముందుగా టిక్కీ అరేంజ్ చేసి, దాని మీద చోలే గ్రేవీని పోయాలి. తర్వాత పెరుగు మరియు కొంచెం చట్నీ వేసి దాని మీద వెల్లుల్లి ముక్కలు గార్నిష్ గా అలంకరించి హాట్ హాట్ గా సర్వ్ చేయాలి.

English summary

Potato Tikki-Choley Chaat | ఆలూ టిక్కీ - చోలే చాట్

A Tikki is nothing but a flattened cutlet made out of alu. Its to be eaten with Cholay masala, Pudina and Tamarind chutney.
Story first published:Wednesday, June 27, 2012, 17:30 [IST]
Desktop Bottom Promotion