For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చురుమురి లడ్డు(బొరుగుల లడ్డు): వినాయకచవితి స్పెషల్

|

వినాయక చవితి సందడి మొదలైంది.. చవితి దేవునికి చవులూరే వంటకాలతో స్వాగతం పలికే సందర్భం ఇది. భక్తుల పెట్టే ప్రసాదం భుజించి, వరప్రసాదాలు అందించే వినాయకుడికి నైవేద్యాల విందుతో నిండుదనం చేకూర్చుదాం. గణనాథునికి ప్రీతి పాత్రమైన రుచులు తయారుచేసి నైవేద్యం పెడితే మీరు కోరిన కోరికలు ఇట్టే తీరుతాయి.

'గణేష్ భగవాన్' తమలో శక్తిని, స్థైర్యాన్ని పెంచి కోరిన కోర్కెలు తీర్చుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి మీ ఆరాధ్యధైవమైన 'బొజ్జగణపయ్య'ను చవితిరోజున ఏలా కొలుద్దామనుకుంటున్నారు. ఏలాంటి ఫలహారం స్వామికి నైవేద్యంగా పెడదామనుకుంటున్నారు. లడ్డులను వివిధ రకాలుగా తయారుచేసి పెడుతుంటారు. వాటిలో చురిమురి లడ్డూ కూడా ఒకటి. ఈ వంట చాలా సులభం మరియు త్వరగా తయారవుతుంది. మరి చురిమురి లడ్డు ఎలా తయారుచేయాలో చూద్దాం...

Puffed Rice Laddoo (Chirmure Laddu)

కావల్సిన పదార్థాలు:
బొరుగులు(చిరమురే): 3cup
బెల్లం తురుము: 1cup
వేయించిన పల్లీలు(వేరుశెనగలు): 2tbsp(మీకు అవసరం అయినంత తీసుకోవచ్చు)
పుట్నాలపప్పు(శెనగపప్పు): 2tbsp(అవసరం అయినంత)
యాలకుల పొడి: 1/2tsp
నెయ్యి

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి, అందులోనే బెల్లం వేసి మీడియం మంట మీద ఉడికించాలి. సిరఫ్ చిక్కబడుతూ, పాకం దగ్గరవుతుండగా, ఒక ప్లేట్ లో నీళ్ళు పోసి, అందులో వేడి పాకం అరటీస్పూన్ తీసి వేయడం వల్ల , చేత్తో పట్టుకొన్నప్పుడు, ఉండలా చేతికి అంటుకొంటుంది. దాంతో పాకం వచ్చినది లేనిది తెలుస్తుంది.
2. తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఈ పాకంలో బొరుగులు మరియు లైట్ గా వేగించుకొన్న పల్లీలను, పుట్నాల పప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే యాలకుల పొడి కూడా వేసి మరో సారి మొత్తం మిశ్రమాన్నిబాగా మిక్స్ చేయాలి.
3. తర్వత చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకొని, చేతి నిండుకు బొరుగుల మిశ్రమాన్ని తీసుకొని పెద్ద పెద్ద లడ్డూలుగా తయారుచేసుకోవాలి. అంతే చురిమురి లడ్డు రెడీ.

English summary

Puffed Rice Laddoo (Chirmure Laddu)

Mumura laddu is one of the most tastiest sweets you can safely enjoy after dinner. Made from puffed rice and gur/jaggery, this Mumura laddu is even healthy for diabetic patients ( to eat in minimum - only).
Story first published: Wednesday, August 27, 2014, 15:57 [IST]
Desktop Bottom Promotion