For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీరకాయ పాయసం

|

Ridge Gourd Payasam
పాయసం అంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే భారతీయ సాంప్రధాయంలో ఏ కార్యానికైనా ముందు తీపి రుచి అందిస్తారు. వాటిలో పాయసం కూడా ఒక్కటి ముఖ్యంగా పండుగలు వచ్చాయంటే చాలు అందరిళ్ళలోనూ పాయసం ఘుమఘుమలే. పాయసంను వివిధ రకాలుగా వండుతుంటారు. పండుగలు అనగానే ముందు గుర్తొచ్చేది పాయసమే.ఎన్నో వెరైటీల పాయసాలు ఉన్నా సేమ్యా సగ్గుబియ్యం వేసి చేసే ఈ పాయసం చాలా ట్రెడిషనల్ ముఖ్యంగా సేమియాలతో చేసే పాయసం చాలా అద్బుతంగా ఉంటుంది. అదే రుచిని తలపించే బీరకాయ పాసం కూడా చాలా బాగా ఉంటుంది. మరీ ఈ పాయసాన్ని వండి మీరూ రుచి చూడండి..

కావలసిన పదార్థాలు:
బీరకాయ: 1
పాలు: 4cups
నీళ్ళు: 2cups
పంచదార: 1cup
యాలకుల పొడి: 1tsp
బాదం, పిస్తా, జీడిపప్పులు: 2tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా బీరకాయను చెక్కి, శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలను నీటిలో వేసి ఉడికించాలి. కుక్కర్ లో అయితే రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది
2. అడుగు మందంగా ఉన్న గిన్నెలో పాలు, పంచదార, పోసి స్టౌ మీద పెట్టాలి. పాలు మరుగుతుండగా బీరకాయ ముక్కలను వేయాలి.
3. బీరకాయ ముక్కలు మెత్తగా అయ్యాక పాలలో కలసిపోయేవరకూ ఉడికించాలి. ఈ మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత యాలయుల పొడి, బాదం, పిస్తా, జీడిపప్పు లను వేసి దించేసుకోవాలి. అంతే బీరకాయ పాసం రెడీ..

English summary

Ridge Gourd Payasam | బీరకాయ పాయసం

Ridge Gourd payasam is a special payasam variety of India. Ridge gourd payasam variety can be easily prepared with minimum effort and time. ridge gourd payasam ingredients are simple .This can be spiced up and nuts can also be added.
Story first published:Wednesday, October 3, 2012, 17:50 [IST]
Desktop Bottom Promotion