For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షీర్ ఖుర్మా-రంజాన్ స్పేషల్

|

Sheer Kurma-Ramzan Spcial
కావలసిన పదార్థాలు
సేమ్యా: 100grms
నెయ్యి/నూనె: 1tbsp
పాలు: 3ltr
పంచదార: 1/4kg
బియ్యప్పిండి: 1/4cup
యాలకులపొడి: 1tsp
పాలపొడి: 1cup
ఎండు ఖర్జూరం: 100grms(కొన్ని నీళ్ళు పోసి, రాత్రి పూట నానబెట్టి, మరుసటి రోజు సన్నగా తరగాలి)
బాదంపప్పు: 50grms
కిస్ మిస్: 50grms
పిస్తాపప్పు: 50grms
పచ్చికొబ్బరి ముక్కలు: 50grms
కెవ్రా(మార్కెట్ లో లభిస్తుంది: 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక పాన్ స్టౌ మీద పెట్టి, నెయ్యి వేసి వేడి చేయాలి.
2. అందులో సేమ్యా వేసి సన్నని మంట మీద ముదురు గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించాలి.
3. ఇప్పుడు పాన్ లో నుంచి సేమ్యాని మరొక బౌల్ లోనికి తీసుకోవాలి.
4. సేమ్యా వేయించిన గిన్నెలోనే పాలు పోసి మరిగించాలి. బియ్యప్పిండిలో కొద్దిగా చల్లని పాలు కలిపిన మిశ్రమాన్ని, పంచదార, యాలకుల పొడి.. వీటిని మరుగుతున్న పాలలో పోసి కలిపి, సన్నని మంట మీద ఉడికించాలి.
5. అందులో తరిగిన ఖర్జూరం, బాదంపప్పు, కిస్ మిస్ పిస్తాపప్పు, కొబ్బరి ముక్కలు వేసి కలపి, సన్నిని మంట మీద ఉడికించాలి.
6. తర్వాత అందులో తరిగిన ఖర్జూరం, బాదంపప్పు, కిస్ మిస్, పిస్తాపప్పు, కొబ్బరి ముక్కలు వేసి కలపాలి.
7. ఇప్పుడు సేమ్యా వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాలు ఉంచి, తీయాలి.

English summary

Sheer Kurma-Ramzan Spcial | షీర్ ఖుర్మా-రంజాన్ స్పేషల్

Sheer Khurma is a sweet noodle soup served by many Pakistani, Bangladeshi 
 and Indian Muslims to guests during the holy month of Ramadan.
Story first published:Monday, August 13, 2012, 9:44 [IST]
Desktop Bottom Promotion