For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిస్పీ అండ్ స్పైసీ మసాలా చిప్ ఛాట్ రిసిపి

|

సాధారణంగా రోజూ తిన్నఆహారాలే తింటూ చాలా బోర్ గా ఫీలవుతుంటారు. అప్పుడప్పు కొత్త రుచులను టేస్ట్ చేస్తుంటే చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. ఈవెనింగ్ స్నాక్స్ లో వివిధ రకాలు ఉన్నాయి. స్వీట్స్ మరియు స్పైసీ స్నాక్స్ ఉన్నాయి. వీటిలో మనకు ఇష్టమైన ఫేవరెట్ డిష్ లను తయారుచేసుకొని తినడమే..

ఈవెనింగ్ స్నాక్ రిసిపిలలో చాట్స్ లో చిప్ చాట్స్ చాలా వెరైటీగా, క్రిస్పీగా ఉంటుంది. దీన్ని తయారుచేయడం కూడా సులభమే. కొన్ని మసాలాలు జోడించి చిప్ ఛాట్ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బడ్స్ కు ఒక కొత్త రుచిని పరిచేయం చేస్తాము .

ఈ చిప్ చాట్ రిసిపిని ఈవినింగ్ సమయంలో ఇంట్లో వారికి మీరే స్వయంగా వండి పెట్టండి క్రెడిట్ కొట్టేయండి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Spicy Masala Chips Chaat Recipe

కావల్సిన పదార్థాలు:
పొటాటో చిప్స్ - 500 g
సేవ్ - 1 cup
పచ్చిమిర్చి పేస్ట్ - 1/2 teaspoon
బెల్లం తురుము - 1/2 teaspoon
గ్రౌండ్ నట్స్ - 1/2 teaspoon
ఎండు మిర్చి పౌడర్ - 1/2 teaspoon
క్యారెట్ - 1/2 cup (finely chopped)
ఉల్లిపాయలు- 1/2 cup (finely chopped)
కీర - 1/2 cup (finely chopped)
నిమ్మరసం - 1/2 teaspoon
కొత్తిమీర - 4 to 5 (finely chopped)
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా , పొటాటో చిప్స్ ను చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేయాలి.
2. తర్వాత బ్రేక్ చేసిన పొటాటో చిప్స్ పీసెస్ ను పెద్ద బౌల్లోకి మార్చుకోవాలి.
3. ఇప్పుడు, ఈ బౌల్లో పచ్చిమిర్చి, అల్ల పేస్ట్, వేరుశెనగపప్పు, రెడ్ చిల్లీ పౌడర్ వేసి మొత్తం మిశ్రమం బాగా మిక్స్ చేయాలి.
4.తర్వాత ఇందులోనే క్యారెట్ తురుము, ఉల్లిపాయ తరుగు మరియు కీరదోస తరుగు మరియు నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈపదార్థాలన్నింటిని బాగా మిక్స్ చేయాలి.
5. చివరగా కొత్తిమీర సేవ్ చిలకరించే సర్వ్ చేయాలి. అంతే స్పెషల్ చిప్ చాట్ రిసిపి రెడీ.

Story first published: Thursday, May 12, 2016, 16:42 [IST]
Desktop Bottom Promotion