For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ మష్రూమ్ మంచూరియన్ : స్టార్టర్స్ రిసిపి

|

చైనీస్ ఫుడ్ అంటే అందరకీ చాలా ఇష్టమైన ఆహారం. ఒరిజినల్ చైనీస్ ఫుడ్ మనకు అందుబాటులో ఉండదు కాబట్టి, చైనీష్ స్టైల్లో మనం ఇండియన్ ఫుడ్ ను తయారుచేసుకోవచ్చు. అటువంటి వంటల్లో మష్రుమ్ మంచూరియన్ ఒకటి. వీటికి ఎక్కువ మసాలాలతో మరియు కారంగా ఉండే సాస్ తో రుచికరంగా తయారుచేస్తారు. ఈ ఇండో చైనీ రిసిపి స్పెషల్ ట్రీట్ చేస్తుంటారు .

మన ఇండియన్స్ కు చాలా ఇష్టమైన స్నాక్ రిసిపి మంచూరియన్. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లో చికెన్ మంచూరియన్ ఒకటి . అదే విధంగా పెప్పర్ మరియు గోబీ మంచూరియన్ కూడా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. మంచూరియన్ వర్షన్ వంటల్లో గోబీ మంచూరియన్ ఒకటి. అదే స్టైల్లో కొత్తగా కొత్త రుచికోసం మష్రుమ్ లను ఉపయోగించి మంచూరియన్ స్టార్టర్స్ రిసిపిని కూడా తయారుచేసుకోవచ్చు. చాలా పాపులర్ అయినటువంటి వంట. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావలసినపదార్థాలు:
కార్న్‌ఫ్లోర్ - 5tbsp
మైదా పిండి - 2tbsp
తాజా మష్రూమ్స్ - 1/2kg
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1tsp
సోయా సాస్ - 1tsp
నూనె - తగినంత
ఉప్పు - తగినంత


సాండ్ విచ్ - క్యారట్ మంచూరియన్

వేయించడానికి:
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1tsp
పచ్చిమిర్చి తరుగు - 1tsp
ఉల్లి తరుగు - 1/2cup
ఉల్లికాడల తరుగు - 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
నూనె - 2 tbsp
సోయా సాస్ - 1tsp
చిల్లీ సాస్ - 1tsp
టొమాటో కెచప్ - 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా

బేబీ కార్న్ ఫ్రై: స్పైసీ స్టాటర్స్ రిసిపి

తయారుచేయు విధానం:

1. మష్రూమ్‌లను మురికి పోయేలా శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద ఆరబెట్టి, తడి పోయాక ముక్కలుగా కట్ చేయాలి. (ముక్కల పరిమాణం మధ్యస్థంగా ఉండాలి)
2. తర్వాత ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి ముద్ద, అర టీ స్పూను సోయా సాస్, ఉప్పు , 4 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి పకోడీల పిండి మాదిరిగా కలపాలి
3. మష్రూమ్ ముక్కలు జత చేసి కలపాలి.
4. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడిఅయ్యాక, కొద్దికొద్దిగా పిండి తీసుకుని పకోడీల మాదిరిగా వేయాలి. (కొద్దిగా బంగారు వర్ణంలోకి మారగానే తీసేయాలి. లేదంటే మాడిపోతాయి).
ఇలా అన్నీ తయారుచేసి, పక్కన ఉంచాలి.
5. వెడల్పాటి పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి పెద్ద మంట మీద రెండు నిమిషాలు వేయించాలి .
6. అందులోనే టొమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, వే యించిన మంచూరియాలు వేసి బాగా కలిపి, ఉల్లికాడల తరుగు వేసి మరో మారు కలపాలి .
7. అన్నీ బాగా కలిసినట్లు అనిపించగానే మంట ఆర్పేసి, టొమాటో సాస్‌తో వేడివేడి మష్రూమ్‌లు అందించాలి.

English summary

Spicy Mushroom Manchurian: Starters Recipe

Mushroom manchurian is a delicious blend of Indian and Chinese cuisine. Manchurian is a popular variety in the Chinese cuisine. However, many countries have modified this version of Chinese cuisine in their own way. Paneer, mushroom, chicken and gobi manchurian are few popular starters that are popular in India. These starters are a blend of Indian and Chinese cuisines.
Story first published: Saturday, January 16, 2016, 15:43 [IST]
Desktop Bottom Promotion