For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ ఆనియన్ దోసె

|

Spicy-Tasty Onion Dosa
కావలసిన పదార్థాలు:
మినప్పప్పు : 1cup
ఉప్పుడుబియ్యం: 1/2cup
పచ్చిబియ్యం: 11/2cup
ఉల్లిపాయ ముక్కలు: 2cups
పచ్చిమిర్చి తరుగు: 1/4 కప్పు
కొత్తిమీర తురుము: 2tbsp
పళ్ళీలు(వేరుశెనగలు): 2tbsp
పచ్చి శెనగపప్పు: 2tbsp
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించటానికి సరిపడా

తయారుచేసే విధానం:
1. ముందుగా బియ్యం, మినప్పప్పు శుభ్రంగా కడిగి ౩ గంటల పాటు నానబెట్టాలి. తర్వాత మెత్తగా రుబ్బుకొని, తగినంత ఉప్పు కలిపి అట్టుపిండిని రాత్రంతా నానబెట్టుకోవాలి.
మిగిలిపోయిన దోసె పిండిని కూడా వుపయోగించి ఊతప్పం వేసుకోవచ్చు..
2. మరుసటి రోజు ఉదయం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తమిర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకవాలి.
3. దోసె వేయడానికి ఒక గంట ముందే పచ్చి శెనగపప్పును నీళ్ళలో నానబెట్టు కోవాలి. అలాగే పళ్ళీలను దోరగా వేయించి పొట్టితీసి దబ్బలుగా చేసిపెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టౌ మీద దోసె పాన్ పెట్టి వేడి చేసిన తర్వాత నూనె రాసి పెనంపై మామూలు దోసెకి ఉపయోగించే పిండి కంటే, కొంచెం ఎక్కువ పిండితో మందంగా దోసెలాగా వేసుకోవాలి.
5. దోసె కాలకముందే దీనిపై తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తమిర ముక్కలు, పళ్ళీలు, నానబెట్టిన పచ్చిశెనగపప్పు లు వేసి రెండు స్పూన్ల నూనె వేసి, రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
6. ఇలా ఒక్కొక్క ఐటమ్ చల్లకోవడం ఇబ్బందిగా ఉంటే కట్ చేసి పెట్టు కొన్న అన్ని పదార్థాలతో పాటు, పళ్ళీలు, పచ్చి శెనగపప్పు, వేసి చిటికెడు పసుపు వేసి బాగా పిండిలో కలిసేలా కలుపుకొని దోసె వేసుకోవచ్చు దీనిని ఆనియన్ దోసె లేదా ఊతప్పం అంటారు. దీనికి పళ్ళీల చట్నీ, కొబ్బరి చట్నీ, ఎర్ర కారం మంచి కాంబినేష్....

సూచనలు: ఈ ఊతప్పంని సన్నని మంటపై కాల్చుకోవాలి,లేకపోతె లోపల ఉడకదు. ఇది తయారు చేసే సమయం మామూలు దోసె కంటే కొంచెం ఎక్కువ వుంటుంది.
ఊతప్పాన్ని నూనెతోనే కాకుండా వెన్న, నెయ్యితో కూడా చేసుకోవచ్చు.

English summary

Spicy-Tasty Onion Dosa....| స్పైసీ ఆనియన్ దోసె

Onion Dosa is a typical South Indian food rich in carbohydrates and proteins. Onion Dosa Recipe made easy with onions. This is a quick mixed dosa. This is the most popular breakfast in South India.
Story first published:Friday, April 6, 2012, 12:21 [IST]
Desktop Bottom Promotion