For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వస్‌ రోల్ కేక్

|

Swas Roll Cake
కావలసిన పదార్ధాలు:

మైదాపిండి - 50 grm
కోడిగుడ్లు - 3
బేకింగ్ పౌడర్ - 1/4 tsp
వేడినీరు - 1 cup
వెనిల్లా ఎసెన్స్ - 1/4 tsp
పంచదార - 100 grm
జామ్ - 50grm

తయారు చేయు విధానం:

1. మైదాపిండిని, బేకింగ్ పౌడర్‌ను జల్లెడలో జల్లించుకుని, రెండింటిని కలిపి వేడినీరు పోసి ముద్దలా చేసుకోవాలి.
2. కోడిగుడ్డు సొనను తీసుకుని బాగా కలియబెట్టాలి. ఇందులో పంచదార వేసి బాగా కరిగేలా కలపాలి.
3. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి నీరు మరుగుతున్న పాత్రలో ఉంచాలి, ఆవిరి వల్ల కోడిగుడ్డు సొన వేడెక్కి, సొనంతా చిక్కగా అయి గట్టిపడినట్లవుతుంది. దీనిని చెంచాతో కలిపి క్రీమ్‌లా చేయాలి.
4. ఈ క్రీమ్‌కు మైదా, బేకింగ్ పౌడర్ మిశ్రమాన్ని కూడా జత చేసి, కాస్త ఎసెన్స్ కలపాలి. స్వస్‌రోల్ డబ్బా తీసుకుని దాని లోపలి గోడలకు నెయ్యిగానీ, నూనెగానీ రాయాలి.
5. అందులో పైన కలిపి ఉంచుకున్న పదార్ధం అంతటిని పోయాలి. ఈ డబ్బాను ఓవెన్‌లో ఉంచి 200 సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాలు ఉంచాలి.
6. ఒక పేపర్ తీసుకుని పంచదార పోసి, దానిపైన ఓవెన్‌లో ఉడికించిన పదార్థాన్ని వేడి చల్లారకుండా వేయాలి. పదార్ధం వేడిగా ఉన్నప్పుడే స్పూన్ సాయంతో కేక్ మీద జామ్ రాయాలి. ఈ కేక్‌పై ఐసింగ్ షుగర్, కోకో మొదలైన వాటితో అలంకరించాలి అంతే స్వస్ రోల్ కేక్ రెడీ.

Story first published:Thursday, December 24, 2009, 15:55 [IST]
Desktop Bottom Promotion