For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొంగల్ స్పెషల్ -స్వీట్ పొంగల్

|

భారతదేశంలో పొంగల్ ఫెస్టివల్ చాలా పెద్ద పండుగ. ఎందుకంటే ఈ పండుగను మూడు లేదా నాలుగు రోజుల పాటు అత్యంత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు. తమిళీయులకు కూడా అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ పండుగ రోజున ప్రత్యేకంగా స్వీట్ పొంగల్ ను వండి ఇంట్లోని వారికి, బంధువులకు వడ్డిస్తారు. అంతే కాదండోయే ప్రత్యేకంగా పాలతో చేసిన పొంగల్ ను పసుపుకుంకులను కలిపి చేలలో చల్లలుతారు పల్లెల్లో. పంటలు బాగా పండాలే పొంగల్ ను ఇలా చల్లడం పూర్వ కాలం నుండి వస్తున్న ఆనవాయితి.

పొంగల్లో రెండు రకాలున్నాయి, స్వీట్, మరియు కారం పొంగల్. స్వీట్ పొంగల్ తయారు చేయడం చాలా సులభం. ఈ స్వీట్ పొంగల్ లేకుండా ఈ పండుగ పూర్తి కాదు. మరి ఈ స్వీట్ పొంగల్ ఎలా తయారు చేయాలో చూడండి...

బియ్యం: 1 cup
పెసరపప్పు: ½ cup
పాలు: 1 cup
బెల్లం: 3 cups (powdered)
జీడిపప్పు: 8:10 (halved)
ద్రాక్ష: 5:6 Nutmeg: 1 (grated)
యాలకులు: ½tsp
లవంగాలు: 2
నెయ్యి: 4tbsp
కుంకుమపువ్వు: a pinch
నీళ్ళు: 2/3 cups

Sweet Pongal

1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో పెసరపప్పును వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత బియ్యంను నీటితో శుభ్రం చేసుకొని, అందులో వేయించి పెట్టుకొన్న పెసరపప్పు, పాలు పోసి బాగా మిక్స్ చేసి కుక్కర్ లో వేసి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసి బాగా మరిగించి అందులో బెల్లం వేసి కరిగేంత వరకూ ఉడికిస్తూ కలియబెడుతుండాలి.
4. ఒక్కసారి బెల్లం పాకం చిక్కబడే సమయంలో కుక్కర్ లో ఉడికించుకొన్ని పప్పు, రైస్ మిశ్రమాన్ని వేసి మరో రెండు నిముషాలు మెత్తగా ఉడికించుకోవాలి.
5. అంతలోపు ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి ఉడుకుతున్న పొంగల్ లో మిక్స్ చేసుకోవాలి.
6. ఇప్పుడు లవంగాలు, యాలకులు, కుంకుమ వేసి బాగా మిక్స్ చేసి మరో ఒకటి రెండు నిముషాలు ఉడికించాలి. అంతే సంక్రాంతి స్వీట్ పొంగల్ రెడీ.

English summary

Sweet Pongal Recipe | స్వీట్ పొంగల్-పొంగల్ స్పెషల్

Pongal is one of the biggest festivals in India. Also known as Tamil harvest festival, Pongal is a four days festival that is celebrated with great vigour and joy in the state. Pongal is the cooked rice and dal that is served to family members and guests. There are two types of Pongal, sweet and salted. The sweet Pongal is an easy to make recipe and a festival is incomplete without any sweet dish.
Story first published: Saturday, January 12, 2013, 15:17 [IST]
Desktop Bottom Promotion