Just In
- 3 min ago Bhagavad Gita Slokas : భగవద్గీతలోని ఈ శ్లోకాలు జీవితానికి చాలా అవసరం..!
- 54 min ago పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- 1 hr ago మేషరాశిలో శుక్రుడి సంచారం ఈ రాశుల వారు భోగభాగ్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతారు
- 2 hrs ago టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
తంబిట్టు : వర మహాలక్ష్మీ వ్రత స్పెషల్ డిష్
శ్రావణ మాసం మొదలైందంటే చాలు పండగలు, నోములు, వ్రతాలు.. ప్రసాదాలు.. అందరూ బిజీ . బిజీ.. ఒక్కోక్కో పండగకి ఒక్కో నైవేద్య చేసి దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తారు. వచ్చిన అతిథులకు కు అందిస్తారు. మరి ఈ శ్రావణ మాసంలో జరుపుకోనే మహిళలకు అతి ముఖ్యమైన పండుగ వరలక్ష్మీ వత్రం. ఈ పండుగ పర్వదినానా మహాలక్ష్మికి ఇష్టమైన తీపి రుచులతో, పిండి వంటలు కూడా చేసి నైవేద్యం సమర్పిస్తారు.
లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే! వరాలు ఇచ్చే తల్లి అంత సులువుగా కనికరిస్తుందా? ఆమెకు ప్రియమైనవి చేయాలి. నైవేద్యం పెట్టాలి. అమ్మా తల్లీ అనాలి. ఆమె ఓకే అన్నాక మనమూ ఒక స్పూను నోట్లో వేసుకోవాలి. అలాంటి ఒక స్వీట్ రిసిపి తంబిట్టు. ఇది చాలా వెరైటీగా,.. టేస్ట్ గా ఉంటుంది. ఈ స్వీట్ రిసిపి తయారుచేయడం చాలా సులభం.చాలా తక్కువ పదార్థాలను సులభంగా తయారుచేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావల్సిన
పదార్థాలు:
గోధుమపిండి:
1cup
బెల్లం:
1cup(పొడి
చేసుకోవాలి)
నెయ్యి:
3/4cup
నీళ్ళు
:
సరిపడా
తయారుచేయు
విధానం:
1.
ముందుగా
ఒక
పాన్
తీసుకొని
అందులో
కొద్దిగా
నెయ్యి
వేసి
వేడి
అయ్యాక
అందులో
ఒక
కప్పు
గోధుమపిండి
వేయాలి.
2.
గోధుమపిండి
రెడ్
కలర్
వచ్చే
వరకూ
వేగించుకోవాలి.
3.
మరో
పాన్
లో
2కప్పుల
నీరు
పోసి
మరిగేటప్పుడు
అందులో
బెల్లం
వేసి
కరిగే
వరకూ
ఉడికించాలి.
తర్వాత
బెల్లం
నీరు
ఫిల్టర్
చేసి
చల్లారనివ్వాలి.
5.
ఇప్పుడు
పాన్
లో
బెల్లం
నీళ్ళు
(జాగ్రీ
సిరఫ్)
పోసి
అందులో
ఫ్రై
చేసుకొన్న
గోధుమపిండి
వేసి
బాగా
కలియబెట్టాలి.
ఉండలు
కట్టకుండా
కలియబెట్టాలి
.
6.
5నిముషాలు
పక్కన
పెట్టాలి.
తర్వాత
చేతిలోకిది
నెయ్యి
తీసుకొని
రెండు
అరచేతులకు
మర్ధన
చేసి
పిండి
నుండి
కొద్దికొద్దిగా
తీసుకొని
చిన్న
ఉండలు
చుట్టుకోవాలి.
అంతే
వర
మహాలక్ష్మీ
పూజకు
ఒక
స్పెషల్
అండ్
టేస్టీ
స్వీట్
డిష్
రెడీ.