For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తంబిట్టు : వర మహాలక్ష్మీ వ్రత స్పెషల్ డిష్

|

శ్రావణ మాసం మొదలైందంటే చాలు పండగలు, నోములు, వ్రతాలు.. ప్రసాదాలు.. అందరూ బిజీ . బిజీ.. ఒక్కోక్కో పండగకి ఒక్కో నైవేద్య చేసి దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తారు. వచ్చిన అతిథులకు కు అందిస్తారు. మరి ఈ శ్రావణ మాసంలో జరుపుకోనే మహిళలకు అతి ముఖ్యమైన పండుగ వరలక్ష్మీ వత్రం. ఈ పండుగ పర్వదినానా మహాలక్ష్మికి ఇష్టమైన తీపి రుచులతో, పిండి వంటలు కూడా చేసి నైవేద్యం సమర్పిస్తారు.

లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే! వరాలు ఇచ్చే తల్లి అంత సులువుగా కనికరిస్తుందా? ఆమెకు ప్రియమైనవి చేయాలి. నైవేద్యం పెట్టాలి. అమ్మా తల్లీ అనాలి. ఆమె ఓకే అన్నాక మనమూ ఒక స్పూను నోట్లో వేసుకోవాలి. అలాంటి ఒక స్వీట్ రిసిపి తంబిట్టు. ఇది చాలా వెరైటీగా,.. టేస్ట్ గా ఉంటుంది. ఈ స్వీట్ రిసిపి తయారుచేయడం చాలా సులభం.చాలా తక్కువ పదార్థాలను సులభంగా తయారుచేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Thambittu For Varamaha lakshmi Vrat

కావల్సిన పదార్థాలు:
గోధుమపిండి: 1cup
బెల్లం: 1cup(పొడి చేసుకోవాలి)
నెయ్యి: 3/4cup
నీళ్ళు : సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో ఒక కప్పు గోధుమపిండి వేయాలి.
2. గోధుమపిండి రెడ్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. మరో పాన్ లో 2కప్పుల నీరు పోసి మరిగేటప్పుడు అందులో బెల్లం వేసి కరిగే వరకూ ఉడికించాలి. తర్వాత బెల్లం నీరు ఫిల్టర్ చేసి చల్లారనివ్వాలి.
5. ఇప్పుడు పాన్ లో బెల్లం నీళ్ళు (జాగ్రీ సిరఫ్) పోసి అందులో ఫ్రై చేసుకొన్న గోధుమపిండి వేసి బాగా కలియబెట్టాలి. ఉండలు కట్టకుండా కలియబెట్టాలి .
6. 5నిముషాలు పక్కన పెట్టాలి. తర్వాత చేతిలోకిది నెయ్యి తీసుకొని రెండు అరచేతులకు మర్ధన చేసి పిండి నుండి కొద్దికొద్దిగా తీసుకొని చిన్న ఉండలు చుట్టుకోవాలి. అంతే వర మహాలక్ష్మీ పూజకు ఒక స్పెషల్ అండ్ టేస్టీ స్వీట్ డిష్ రెడీ.

English summary

Thambittu For Varamaha lakshmi Vrat

Thambittu For Varamaha lakshmi Vrat, The Varamahalakshmi puja is usually observed by married women in regions of Tamil Nadu, Karnataka, Andhra Pradesh and other parts of South India. The Varamahalakshmi puja for the year 2015 will be celebrated on August 28.
Desktop Bottom Promotion