For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాటర్ మిలన్ అండ్ మింట్ మాక్‌ టైయిల్

|

Watermelon
పుచ్చకాయ (Watermelon) నే కర్బూజా అని కూడా అంటారు. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

మనసును ఆహ్లాదపరిచే సువాసన... అంతకు మించి ఎక్కువ రుచి, తక్కువ కెలొ రీలు, కొవ్వు దీని ప్రత్యేకత. కాయలో యాంటీ ఆక్సిడెంట్‌గుణాలు అధికం. అందుకే హానికారక ఫ్రీరాడికల్స్‌ను అద్భుతంగా ఎదుర్కొంటుంది. ఎండల్లో చర్మం వడదెబ్బ బారినపడి కమిలిపోకుండా రక్షిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అంతే కాదు ఇందులో బ్యూటీ మరియు స్కిన్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి. బీ-కాంప్లెక్స్‌ విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. ఇన్ని సుగుణాలున్న పుచ్చకాయతో మాక్ టెయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు:
గింజలు తీసిన పుచ్చకాయ ముక్కలు : 2cups
నిమ్మరసం : 1/2cup
చక్కెర : 4tsp
ఐసు ముక్కలు : తగినన్ని
తాజా పూదీన ఆకులు : 15

తయారు చేసే పద్ధతి:
1. ముందుగా పుచ్చకాయ ముక్కలు, పూదీన ఆకులను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
2. తర్వాత ఆ మిశ్రమాన్ని వడగట్టి దానికి తగినన్ని నీళ్లు చేర్చుకోవాలి.
3. తర్వాత నిమ్మరసం, చక్కెరపాకం వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి ఒంపి పైన తగినన్ని ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేస్తే సరి. చల్లచల్లని మిలన్ అండ్ మింట్ మాక్‌టెయిల్ రెడీ! ఈ జ్యూస్ బాగా చల్లగా కావాలనుకునేవారు కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత సేవించవచ్చు.

English summary

Watermelon and Mint mocktail | పుచ్చకాయ స్పెషల్ మాక్ టైయిల్

This is by far one of the simplest, yet impressive looking summer drinks you could entertain with.Watermelon and mint make for a particularly refreshing flavor combo best enjoyed on a hot summer day. Add some rum for an adult cocktail or serve it straight up as a mocktail for all to enjoy.
Story first published:Friday, February 22, 2013, 12:10 [IST]
Desktop Bottom Promotion